హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Megastar Chiranjeevi: మారేడుమిల్లిలో 'ఆచార్య'.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. చరణ్ తో కలిసి షూటింగ్

Megastar Chiranjeevi: మారేడుమిల్లిలో 'ఆచార్య'.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. చరణ్ తో కలిసి షూటింగ్

ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఉమన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే దీనిపై స్పందించి ఏపీ కాంగ్రెస్.. చిరంజీవి కాంగ్రెస్‌వాదే అని వివరణ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఉమన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే దీనిపై స్పందించి ఏపీ కాంగ్రెస్.. చిరంజీవి కాంగ్రెస్‌వాదే అని వివరణ ఇచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా (Acharya Movie) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ శివారులో వేసిన టెంపుల్ సెట్లో షూటింగ్ జరిగిన యూనిట్... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అయింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రీకరణలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రి చేరుకున్నారు. మారేడుమిల్లి ఏజెన్సీతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ మారేడుమిల్లి చేరుకొని షూటింగ్ లో పాల్గొంటుండగా.. ఆదివారం చిరంజీవి రాజమండ్రి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. చిరుకి అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగింది.

మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనున్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నారు. ఈ క్రమంలో మారేడుమిల్లిలో షూటింగ్ ను షెడ్యూల్ చేశారు. చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్లో కొన్ని సీన్లు మారేడుమిల్లిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కంటే నాలుగురోజుల ముందే రామ్ చరణ్ మారేడుమిల్లి చేరుకున్నారు.

' isDesktop="true" id="771842" youtubeid="u2Zv-b470aM" category="andhra-pradesh">


ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని చిత్రయూనిట్ చెప్తోంది. అవినీతిని సహించని యువకుడి పాత్రలో చరణ్ కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. సిద్ధా పాత్రలోని చరణ్ లుక్ ను ఇప్పటికే యూనిట్ రిలీజ్ చేసింది. సినిమాలో చరణ్ పాత్ర కనిపించేది కొంతసేపే అయినా సినిమా మొత్తం ఆ ప్రభావం ఉంటుందట. డైరెక్టర్ కొరటాల శివ ఈ రోల్ ను చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు చెప్తునారు. చరణ్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని టాక్. మరోవైపు ఇటీవలే విడుదలైన ఆచార్య టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆచార్యలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తోంది. సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. అజయ్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇటీవల మెగాఫ్యామిలీ సినిమాలకు మారేడుమిల్లి షూటింగ్ స్పాట్ గా మారిపోయింది. గతనెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ దాదాపు రెండువారాలపాటు జరిగింది. ఈ సందర్భంగా గిరిజనులు అల్లు అర్జున్ కు ఘనస్వాగతం పలికారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి, రాంచరణ్ తమ ప్రాంతానికి వస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Aacharya, Allu Arjun, Chiranjeevi, East Godavari Dist, Koratala siva, Mega Family, Megastar, Megastar Chiranjeevi, Pushpa Movie, Rajahmundry S01p08, Ram Charan, Sonu Sood

ఉత్తమ కథలు