Home /News /andhra-pradesh /

HERE ARE THE HISTORY BEHIND ENGLISH NAMED AREAS IN KRISHNA DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN BK

Andhra Pradesh: ఇంగ్లీష్ పాలెం, డ‌చ్ పేట, రాబ‌ర్ట్ స‌న్ పేట..! ఆంధ్రాలో ఫారిన్ ఏరియాలా..? ఎక్కడున్నాయబ్బా..!

మచిలీపట్నం (ఫైల్)

మచిలీపట్నం (ఫైల్)

ఇంగ్లీష్ పాలెం, డ‌చ్ పేట, రాబర్ట్ సన్ పేట..! ఇదేంటీ.. ఈ టెంగ్లిష్ పేర్లు ఎక్క‌డో తేడాగా ఉన్నాయ‌నుకుంటున్నారా..? లేక ఏదో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనుకుంటున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే ఉన్నాయి.

    M BalaKrishna, Hyderabad, News18

    ఇంగ్లీష్ పాలెం, డ‌చ్ పేట, రాబర్ట్ సన్ పేట..! ఇదేంటీ.. ఈ టెంగ్లిష్ పేర్లు ఎక్క‌డో తేడాగా ఉన్నాయ‌నుకుంటున్నారా..? లేక ఏదో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనుకుంటున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే ఉన్నాయి. అందునా కృష్ణా జిల్లా (Krishna District) కేంద్రమైన మచిలీపట్నం (Machilipatnam) లోనే ఉన్నాయి. అదేంటి అచ్చ తెలుగు ప్రాంతంలో ఇంగ్లీష్ పేర్లు ఎలా వచ్చాయనుకుంటున్నారా..? దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా వందల ఏళ్ల హిస్టరీ ఈ పేర్లకు ఉంది. ప్రపంచంలోని పురాతన ఓడరేవులలో మచిలీపట్నం ఓడ‌రేవు చాలా ప్ర‌సిద్ది చెందింది. 17వ శతాబ్దంలోనే దీన్ని నిర్మించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ఓడరేవు గా ఉంది. అయితే వందల సంవత్సరాలు గడిచినప్పటికీ, ఓడ‌రేపు ప‌రిస‌ర‌ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్థ‌లాల పేర్లు ఇప్పటికీ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, పోర్చుగీస్ వ్యాపారులు మచిలీపట్నం వచ్చి అనేక దశాబ్దాలుగా వస్త్రాలను ఎగుమతి చేసి వారి అన‌వాళ్ల‌ను అలానే వ‌దిలి వెళ్లారు.

    వలందపాలెం: 1602వ సంవత్సరంలో డచ్ వారు సముద్ర మార్గం ద్వారా మచిలీపట్నంలోకి ప్రవేశించారు. ఈ వ్యాపారులు ఎక్కువగా నెదర్లాండ్స్ రాజధాని హాలండ్ నుండి వచ్చి మాచవరంలో స్థిరపడ్డారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అంద‌రు వాలందపాలెం అని పిలుస్తారు. హాలండ్ నుండి వచ్చిన వ్యాపారులను హాలండేయులు లేదా హొలండేయ అని పిలిచేవారు. వారు 'వొల్లండేయ'గా మారారు. 'వొల్లండేయ' ప్రజల నివాసాన్ని వొల్లండేయపాలెం అని పిలుస్తారు. కొన్నేళ్లుగా ఆ పేరు మారుతూ వ‌చ్చి ఇప్పుడు వలందపాలెంగా మారింది.

    ఇది చదవండి: అక్కడ లైట్లు వేస్తే చేపలు పడతాయ్.. మత్స్యకారులు వినూత్న ఆలోచన..!


    ఫ్రెంచ్ పేట: ఫ్రెంచ్ వ్యాపారులు 1756వ సంవత్సరంలో రాజధాని నగరం ప్యారిస్ నుండి మచిలీపట్నం వచ్చారు. అనేక దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడ్డారు. ఫ్రాన్స్ నుండి వచ్చిన ప్రజలను ఫరాసులు లేదా పరశులు అని పిలుస్తారు. వారు నివాసం ఉన్న ప్రాంతాన్నిప్ర‌స్తుతం పరాసుపేట లేదా ఫ్రెంచ్ పేట అని పిలుస్తారు.

    ఇది చదవండి: అరుదైన జీవాలకు పుట్టిల్లు మన ఏపీ తీరం.. శీతాకాలంతో సందడి చేస్తున్న సముద్రజీవులు..


    ఇంగ్లీష్ పాలెం: బ్రిటీష్ వారు 1611 సంవత్సరంలో మచిలీపట్నం వచ్చి వందల సంవత్సరాలు అక్కడే స్థిరపడ్డారు. వారు ఈస్టిండియా కంపెనీ సహాయంతో కలంకారి వస్త్రాలను ఎగుమతి, దిగుమతి చేయ‌డం చేసేవారు. బ్రిటీషర్లు ప్రధానంగా రంగ్రేజ్ పాలెంలో నివసించారు, అక్కడ రంగేజులు (బట్టలకు రంగులు వేసే వ్యక్తులు) ఎక్క‌వ ఉంటారు. ముస్లిం జనాభా దీనిని 'అంగ్రేజులు' అని పిలిచేవారు అయితే కాలక్రమేణా బ్రిటిష్ వారి ప్రవేశంతో దీనిని ఇంగ్లీష్ పాలెం అని పిలిచేవారు. వైల్డ్ ఫారెస్ట్ రోడ్ ఈ ప్రాంతం ఒక రకమైన రిజర్వ్ ఫారెస్ట్. అయితే ఈ ప్రాంతం ఇప్పుడు పెద్ద పెద్ద క‌ట్ట‌డాల‌తో ఉన్న‌ప్ప‌టికి ఈ ప్రాంతాన్ని ఇప్ప‌టికి వైల్డ్ ఫారెస్ట్ రోడ్ అనే పిలుస్తున్నారు.

    ఇది చదవండి: కేకులతో కేక పెట్టిస్తున్న వైజాగ్ సిస్టర్స్.. వీరి టాలెంట్, టేస్ట్ కి ఫిదా అవ్వాల్సిందే..!


    రాబర్ట్‌సన్‌పేట: 1816 సంవత్సరంలో, రాబర్ట్‌సన్ అనే యూరోపియన్ వ్యక్తి కృష్ణాజిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ స‌మ‌యంలో ఈ ప్రాంతంలో భారీ మార్కెట్‌ను నిర్మించారాయ‌న‌. రాబర్ట్‌సన్ కలెక్టర్ కాకముందు, దోపిడీలకు పేరుగాంచిన అదే ప్రాంతానికి అసిస్టెంట్ కలెక్టర్‌ గా పనిచేశాడు దీంతో ఆయ‌న నివాసం ఉన్న ప్రాంతాన్ని రాబ‌ర్ట్ స‌న్ పేట అని ఇప్పటికీ పిలుస్తారు. ఏపీలో బ్రిటీష్ వారు నివాసమున్న చాలా ప్రాంతాలు ఇంకా ఇంగ్లీష్ పేర్లతోనే పిలవబడుతున్నాయి. యానాంలో ఇప్పటికీ ఫ్రెంచ్ కాలనీలున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Krishna District, Machilipatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు