హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఒత్తిడితో సతమతమవుతున్నారా ? మీ కోసం.. అద్భుతమైన టిప్స్ ... ఇవే..

ఒత్తిడితో సతమతమవుతున్నారా ? మీ కోసం.. అద్భుతమైన టిప్స్ ... ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆఫీసులో కాని ఇంట్లో కాని కమ్యూనికేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్‌ సరిగా లేకుంటే చాలా టైమ్‌ గ్యాప్‌ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్‌ కూడా దెబ్బతింటాయి. దాంతో ఒత్తిడి ఏర్పడుతుంది... మంచి కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోండి. .

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒకరు ఎదుక్కొనే సమస్య స్ట్రెస్. పని చేసే చోట ఒత్తిడి.. ఆఫీసుల్లో, ఇంట్లో ఒత్తిడితో చాలా మంది సతమతమవుతుంటారు. అయితే అలాంటి వారికోసం కొన్ని స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టిప్స్.. ఇక్కడ ఉన్నాయి. ఒత్తిడి నిర్వహణ పై వైద్య సలహాలు..31 సలహాలు.. ఇవి ఆచరిస్తే ఇక తిరుగేలేదు..!? మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నిస్తే మీకూ ఆనందం, ఆహ్లాదం కలగడమే కాక ఇతరుల్నీ ఆనందంగా ఉంచుతారు. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవుతారు. నవ్వడం వల్ల ఫేషియల్‌ మజిల్స్‌, చెస్ట్‌, భుజాలు, మెడ, స్కల్‌ మజిల్స్‌ రిలాక్స్‌ అవుతాయి.

2.ఉదయం పూట నడక మంచిది. అలా కుదరని పక్షాన సాయంత్రం పూట కూడా నడవచ్చు. నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించండి. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం రిలాక్స్‌ అవడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. .రోజుకు 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్రవల్ల మంచి రిలాక్సేషన్‌ ఏర్పడుతుంది. మనస్సు, శరీరం చక్కగా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. మధ్యమధ్యలో నిద్రాభంగం కలగకుండా చక్కటి గదివాతావరణం మంచి పడక, మంచిగాలి ఉండేటట్లు చూసుకోవాలి.

మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనయినప్పుడు చల్లటి నీళ్లతో స్నానం చేసినట్లయితే శరీరం, మనస్సు హాయిగా ప్రశాంతంగా ఫీల్‌ అవుతారు. అలా కుదరని సందర్భాలలో చల్లటి నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని, కావాల్సిన మంచినీరు త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఫీలవుతారు. బయటకు వెళ్లండి. అందుకోసం చక్కటి ప్రణాళికలు వేయండి. అలా కొన్ని కొత్త ప్రదేశాలకు కాని, మీకు ఇష్టమైన ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్‌తో వెళితే బాగా ఎంజాయ్‌ చేస్తారు. అలా చేస్తే మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు.

సంగీతం, సాహిత్య కార్యక్రమాలు మరి కొంతమందికి స్పోర్ట్స్‌, గేమ్స్‌, నృత్యం లాంటి ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా తిలకించడం చేయడం వల్ల ఒత్తిడికి దూరమవుతారు. మీ పరిమితులు, పరిధులు మీకున్నాయి. ప్రతి ఒక్కరు మీతో ఏదో పని చేయించాలని చూస్తారు. అందరినీ సంతోషపెట్టడం అనేది మీకు అలివి కాని పని అని తెలుసుకోండి. ఎదుటివారికి కోపం వస్తుందనుకుని అందరి సమస్యలు మీ నెత్తిన వేసుకుంటూ ఉంటే మీరు మానసిక ఒత్తిడికి గురి అవుతారని తెలుసుకోండి.

ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే కొంతమంది తమకున్న సమయాన్ని వివిధ కార్యక్రమాలకు చక్కగా ఉపయోగించుకుంటారు. అలా కాలాన్ని సద్వినియోగ పరిచే స్కిల్‌ మీలో ఉంటే ఒత్తిడిని అధిగమిస్తారు. అంటే మీరు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో ఒక ప్రయారిటీ లిస్ట్‌ ప్రతిరోజూ రాసుకోవాలి. ముందు ఏ పని చేయాలి. రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనే అంశాలు ముందుగా నిర్ణయించుకోవాలి. దానిప్రకారం మీ పనులు సక్రమంగా నిర్వహించుకుంటే ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. కొన్ని పనులు అర్జంట్‌ కానివి ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైనవి, ఇంకొన్ని ముఖ్యమైనవి కానివి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాటా ప్రాధాన్యత గుర్తించగలిగితే మీకు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

మనకు రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా చేరుకోవాలి అనే విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఒక చక్కని ప్రణాళికను ఏర్పరుచుకున్నట్లయితే ఆ ప్రణాళిక ప్రకారం ఈజీగా ముందుకు వెళ్లగలుగుతాం. కాని కొంతమంది ఎటువంటి ప్రణాళిక లేకుండా పనులు తలపెడుతుంటారు. ఇటువంటి వారు ఒత్తిడికి లోనవుతుంటారు. కనుక మీరు ఏది చేయాలన్నా మంచి ప్రణాళిక వేసుకోవడం మరిచిపోవద్దు. మీలోని ఎమోషన్లను బేలెన్స్‌ చేసుకునే ప్రజ్ఞ మీలో ఉండాలి. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే ఒత్తిడికి లోనుకాకుండా ఉంటారు. మీరు ఇతరులపై కోపం ప్రదర్శించాలనుకున్నప్పుడు అది మీకు మీతోటి వారికి మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండే విధంగా సున్నితంగా ఉండాలి. అలాకాకుండా అవతలివారిని బాధించే విధంగా ఉన్నా లేదా మీరు అతిగా భావోద్వేగానికి గురి అయినా ఒత్తిడి మిమ్మల్ని వెంబడిస్తుంది.

ఆశావహ దృక్పథంతో ఉన్న వ్యక్తులలో సహనం ఎక్కువగా ఉంటూ వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా సున్నితంగా ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. వారిలో ప్రొయాక్టివ్‌ బిహేవియర్‌ ఉంటుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. వారి ఆలోచనలు ఆచరణ ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటివారిలో ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఒత్తిడి ఏర్పడ్డా దాన్నించి బయటపడగల నేర్పుకూడా వారిలో ఉంటుంది. .ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మీరు చేసున్న ఉద్యోగంలో మీకు మంచి నైపుణ్యం ఉండాలి. అలాగే ఆ పనిలో మీకు నాలెడ్జ్‌ కూడా బాగుండాలి. అలా మీలోని నైపుణ్యాలను పెంచుకోకుండా ఉంటే మీరు తరచుగా ఒత్తిడికి గురి అవక తప్పదు. మీరు మీకు ఇచ్చిన పనుల్ని సరిగా చేయలేకపోవడం, సరి అయిన సమయంలో మీరు మీబాస్‌కు ఆ పనిని అప్పగించలేక పోవడం తద్వారా ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. కనుక స్కిల్‌`నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.

మీరు ఎగ్జిక్యూటివ్‌ కావచ్చు. లేదా ఆ క్రింది స్థాయి వ్యక్తి కావచ్చు. మీ ప్రవర్తన ఎసెర్టివ్‌గా ఉండాలి. అంటే ప్రతివ్యక్తిలోనూ మూడు రకాలైన ప్రవర్తనలు ఉంటాయి. అంటే పాసివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ అలాగే ఎసెర్టివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ వల్ల ఇద్దరి మధ్యా ట్రాన్సాక్షన్స్‌ దెబ్బతింటాయి. అలాగే ఎవరైతే ఎగ్రెసివ్‌గా ఉంటారో వారు మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా అప్‌సెట్‌ అవుతారు. తొందరగా ఒత్తిడికి గురవుతారు. పాసివ్‌ బిహేవియర్‌ ఆమోదయోగ్యం కాదు. అది ఇతరుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంది. కనుక ఇతరుల్ని అభిమానించి, గౌరవించేది అంతేకాక వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేది. ఎసెర్టివ్‌ బిహేవియర్‌ను అనుసరించడం వల్ల ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఒత్తిడి లేకుండా ఉంటుంది.

అలాగే భార్యాభర్తలు మధ్యకాని స్నేహితుల మధ్యకానీ, ఆఫీసులో మీతోటి ఉద్యోగస్తుల మధ్యకాని ఎసెర్టివ్‌నెస్‌ అనేది ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఉదాహరణకు మీ అభిప్రాయం బాగుంది. మీరు చెప్పింది కూడా పరిశీలించాల్సిన అంశమే. నేను ఇలా అనుకుంటున్నాను. మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు... ఇలా సంభాషణ కొనసాగితే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. అన్ని పనులు మీరు ఒక్కరే చేయాలనుకోవడం సాధ్యం కాదు. ఆఫీసులో కాని, ఇంట్లో కాని కొన్ని పనులను మీరు ఇతరులకు కేటాయించాలి. ఆయా పనుల ప్రాధాన్యతను బట్టి మీ క్రింది ఉద్యోగులకు, అసిస్టెంట్స్‌కు అలాగే ఇంట్లో అయితే కొన్ని పనులు ఇతర కుటుంబ సభ్యులకు కేటాయించడం వల్ల పని పంచబడుతుంది. దీనివల్ల ఒత్తిడి ఏర్పడదు.

ఇతరులు ఉన్న పొజిషన్‌లో మీరు ఉంటే ఎలా ఫీల్‌ అవుతారు. అనే కోణంలో ఆలోచిస్తే మీ ఆలోచనా ధోరణి సవ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు ఇతర వ్యక్తులతో అనుబంధం సవ్యంగా ఉంటాయి. ఎంపతీ ఫీలింగ్‌ మనిషిని ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది. మీ ఆఫీసులో మీకు ఇచ్చిన జాబ్‌ ఆఖరి క్షణం వరకూ పూర్తి చేయకుండా ఉంటే లెవెన్త్‌ అవర్‌ టెన్షన్‌కు గురి అవుతారు. దాంతో మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన పనులు డెడ్‌లైన్‌కు ముందే ముగించండి. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం చాలా ఆరోగ్యకరమైన విషయం. ఇలాంటివారు ఎంతో కాన్ఫిడెంట్‌గా సరదాగా ఉంటారు. అందరితో మంచి కమ్యూనికేషన్‌, సత్సంబంధాలు ఉంటాయి. దాంతో ఒత్తిడి మీ దరికి చేరదు.

18.ఆఫీసులో బిజీ షెడ్యూల్‌తో ఇంటికి లేటుగా వచ్చి హడావుడిగా మీ కార్యక్రమాలు ముగించుకుని మంచం మీద మౌనంగా పడుకుంటే మీ పార్టనర్‌తో మీకు మంచి రిలేషన్స్‌ ఎలా ఉంటాయి? అందుకు మీ లైఫ్‌ పార్టనర్‌కు కొంత టైమ్‌ కేటాయించండి. మాట్లాడండి... అభినందించండి.... ప్రేమించండి, ముద్దూ ముచ్చట్లతో ఆనందంగా గడపండి. ఇక ఒత్తిడి పరార్‌!  పిల్లలతో ఎక్కువ ఆనందం వస్తుంది.  మీకు పిల్లలు ఉన్నారా? అయితే పిల్లలతో ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వారితో మాట్లాడండి.... వారి ఎమోషన్స్‌, వారి అభిరుచులు, వారితో కలిసిపోండి. ఆడుకోండి. ఆనందించండి.... వారు చిన్న పిల్లలయితే ఎత్తుకోండి. ముద్దాడండి... టీనేజర్స్‌ అయితే వారితో స్నేహితులుగా మారిపోండి. ఇక ఒత్తిడిని మీరు దూరం అవుతారు.

పుస్తకాలు చదివే అలవాటు మిమ్మల్ని అనేక విషయాలవైపు ఆలోచింపచేస్తుంది. మీలో విజ్ఞానంతో పాటు క్రియేటివిటీ, ఆనందం కలుగుతాయి. ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నారా? మానసికంగా గజిబిజిగా ఉందా? ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే మీ ఇంట్లో ఆల్బమ్‌ ఒకసారి తీయడి. ఎన్నో ఫోటోలు, చిన్నప్పటి మీ అనుభూతులు పరిశీలించండి. హాయిగా ఫీల్‌ అవుతారు. .మీ ఇంట్లో గార్డెన్‌ ఉందా? పూలకుండీలు చక్కగా సర్దండి... వాటికి నీరు పోయండి. అలా మీరు ఒక అరగంట సమయాన్ని పూలమొక్కలతో గడపండి... రిలాక్స్‌గా ఫీల్‌ అవండి.

మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటే మీరు ఎంతో ప్రశాంతతకు లోనవుతారు. ఒంటరిగా ఆలోచించే దాని కన్నా ఓ మంచి సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది.ఆఫీసు కావచ్చు. ఇల్లు కావచ్చు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు మంచి రిలాక్స్‌డ్‌గా ఉన్న కలర్స్‌ వాడాలి. వస్తువులు టేబుల్స్‌, పుస్తకాలు, బట్టలు చిందరవందరగా ఉండకూడదు. ఇల్లూ, ఆఫీసు మంచి వాతావరణం స్ఫురించాలి. .మీ సెల్‌ఫోన్‌ కాల్స్‌ను పరిమితం చేసుకోండి. ఎక్కువ సమయం పిచ్చాపాటీ విషయాలతో విపరీతమైన కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. కాల్స్‌కు హద్దులు పెట్టండి.

ఆఫీసులో మీ టేబుల్‌ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ వహించండి. ఫైల్స్‌ ఎలా మెయింటైన్‌ చేయలో తెలుసుకుంటే మీ టేబుల్‌పై ఏఏ ఫైల్స్‌ మీ దగ్గరుండాలో, ఏ ఫైల్స్‌ దాచిపెట్టాలో వాట ఆర్డర్‌ నెంబర్‌ ఎలా ఉండాలి. తిరిగి వాటిని తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్త పడండి.

ఆఫీసులో కాని ఇంట్లో కాని కమ్యూనికేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్‌ సరిగా లేకుంటే చాలా టైమ్‌ గ్యాప్‌ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్‌ కూడా దెబ్బతింటాయి. దాంతో ఒత్తిడి ఏర్పడుతుంది... మంచి కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోండి. .కార్డియాలజిస్టులు వ్యక్తులలో టైప్‌ ఎ అని టైప్‌ బి పర్సనాలిటీ అని రెండు రకాలుగా గుర్తించారు. టైప్‌ ఎ పర్సనాలిటీ గల వ్యక్తులు ఎక్కువ టెన్షన్‌కు గురి అవుతారు. ఎప్పుడూ హర్రీబర్రీగా ఉంటారు. దీంతోవారు స్ట్రెస్‌కు ఈజీగా లోనవుతారు. అలాగే టైప్‌ బి పర్సనాలిటీ వారు నిదానంగా ఆలోచిస్తూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారివారి పనులు చక్కదిద్దుకుంటారు. వీరిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు రిలాక్స్‌డ్‌గా పనులు చేస్తారు. దీనిని గురించి మరింత వివరంగా మీరు - మీ వ్యక్తిత్వంలో చదవండి.

ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా మనకు ఏర్పడే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. నిత్యం మనం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటే మనం ఇతరులు సంతోషంగా ఉంటారు. మన మనసుతో మనకు ఉండే సంబంధాన్ని ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌ అంటారు. మన మనసుని మనం ఎలా నియంత్రించుకుంటున్నాం? మనం ఎలా ఆలోచిస్తున్నాం... మనం ఎటువంటి అభిరుచులు కలిగివున్నాం... మన లావాదేవీలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా అనే ఆలోచనల్ని మనం నిరంతరం గమనిస్తుంటాం. ఈ రిలేషన్‌ సక్రమంగా ఉన్నట్లయితే ఒత్తిడి లేకుండా ఉంటుంది.

ఏదో ఒక సమస్యపై మీలో మీరు తర్కించుకుంటూ బాధపడేదానికన్నా మీ స్నేహితులకు లేదా మీ లైఫ్‌ పార్టనర్‌కు సమస్య వివరించండి. మీకు సొంతంగా పరిష్కారం దొరకని విషయలకు ఇతరుల అనుభవాల నుంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అందుకే మనలో మనం మానసికంగా కుంగిపోవడం కన్నా మిత్రులతో పంచుకుంటూ ఉంటే చాలా రిలాక్స్‌ అవుతాం. అలౌకిక ఆనందం పొందే కంటే లోకం లో ఇతరులకు సహాయం చేయటం లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి. సహాయం పొందే వారి చూపులో ఉండే కృతజ్ఞత భావం మిమ్ములను ఉత్తేజ పరిచి మీ లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంది.

First published:

Tags: Local News, Stress, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు