HERE ARE THE FACTS BEHIND DEGREE STUDENT MISSING CASE IN KAKINADA EAST GODAVARI PRN VSP
Missing Case: కాకినాడలో మిస్సింగ్.. విజయవాడలో ప్రత్యక్షం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి..
కాకినాడలో అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం
తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కాకినాడ (Kakinada) లో అదృశ్యమైన యువతి కేసును ఊహించని మలుపులు తిరిగింది. యువతి కనింపిచకుండా పోయినప్పటి నుంచి రకరకాల వదంతులు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కాకినాడ (Kakinada) లో అదృశ్యమైన యువతి కేసును ఊహించని మలుపులు తిరిగింది. యువతి కనింపిచకుండా పోయినప్పటి నుంచి రకరకాల వదంతులు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి. ఐతే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి యువతిని సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. చదువంటే భయం, పరీక్షలంటే ఒత్తిడితోనే ఆమె ఇలా చేసినట్లు విచారణలో వెల్లడైంది. విరాల్లోకి వెళ్తే.. పిఠాపురం పట్టణంలో పల్లపువీధికి చెందిన యువతి కాకినాడ లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఎం మూడో సంవత్సరం చదువుతూ హాల్‌టిక్కెట్టు తెచ్చుకుంటానని చెప్పి సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తాత పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ఎస్పీ రవీంద్రబాబు స్పందించి అడిషనల్ ఎస్పీ కరణంకుమార్ పర్యవేక్షణలో కాకినాడ డీఎస్పీ భీమారావు, ఆరుగురు సీఐలతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అదృశ్యమైన యువతి ఆటోలో చిత్రాడ సమీపంలోకి వచ్చేసరికి ఆటోడ్రైవర్ అనుమానాస్పదంగా ఉన్నాడని స్నేహితురాలికి వాట్సాప్ ద్వారా పెట్టిన మెసేజ్, సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసుల విచారణలో తేలింది.మెసేజ్ పెట్టిన సమయానికి సదరు యువతి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్నట్లు అక్కడ సీసీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది.
దీంతో సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించి పోలీసులు సఫలమయ్యారు.ఇంటినుంచి బయలుదేరి కాకినాడకు ప్రైవేటు బస్సులో చేరుకుని అక్కడినుంచి ఆమె విజయవాడలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లినట్లు గుర్తించామని డీఎస్పీ వివరించారు. అక్కడినుంచి యువతి బయలుదేరగా పోలీసులు గుర్తించి ఆమెను తీసుకువచ్చి మంగళవారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించారు.
గురువారం నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో యువతి పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై ఈ విధంగా చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. కేసు విచారణలో సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో డీఎస్పీ భీమారావు, పిఠాపురం, సర్పవరం, కాకినాడ వన్, టూటౌన్ సీఐలు, ఐటీకోర్, పీసీఆర్ సీఐలు వైఆర్కే శ్రీనివాస్, మురళీకృష్ణ, రజనీకుమార్, రామచంద్రరావు, నాయక్, ఈశ్వరుడు, ఎస్ఐలు పాల్గొన్నారు.
మొత్తానికి పరీక్షలంటే భయం, చదవుల ఒత్తిడికి పోలీసులను కాకినాడ సిటీ అంతా పరుగులు పెట్టించింది. మరోవైపు వయసుకొచ్చిన కుమార్తె అదృశ్యం కావడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదృశ్యమైన వెంటనే వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా లెఫ్ట్ అవడంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎట్టకేలకు పోలీసుల చొరవతో యువతి ఇంటికి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.