Job Mela: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు (Job Mela) కొనసాగుతున్నాయి. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలో జాబ్ మేళాలు నిర్వహించగా.. తాజాగా గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ లో జాబ్ మేళాను నిర్వహించనుంది
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలో జాబ్ మేళాలు నిర్వహించగా.. తాజాగా గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ లో జాబ్ మేళాను నిర్వహించనుంది. ఈనెల 7,8వ తేదీల్లో రెండు రోజుల పాటు జాబ్ మేళా జరగనుంది. దీని ద్వారా మొత్తం 26,300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 210 కంపెనీలు హాజరవుతున్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారు. పార్టీ వెబ్ సైట్ లో ఇఫ్పటికే 97వేల మంది ఉద్యోగాల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వైసీపీ జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే 30,473 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
జాబ్ మేళాలకు హాజరు కావాలనుకునే ఉద్యోగార్థుల కోసం ప్రత్యేకంగా.. ‘ysrcpjobmela.com’ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాలో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఐటీ కంపెనీలు, రీటెయిల్ లాజిస్టిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కన్సట్రక్షన్ కంపెనీలు, హెల్త్ కేర్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, మార్కెటింగ్ అండ్ సేల్స్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొంటున్నాయి.
ఈ జాబ్‌మేళా కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ముందుగా, యూనివర్సిటీ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. మొబైల్ ఫోన్లో స్కాన్ చేయగానే, ఏ బ్లాక్‌లో ఏయే ఉద్యోగాల ఇంటర్వ్యూలు అన్న వివరాలు తెలుస్తాయి. డైరెక్షన్ బటన్ నొక్కితే అక్కడికి ఎలా వెళ్లాలన్నది తెలుస్తుంది. ఆ తర్వాత బ్లాక్ ఇంఛార్జ్ బటన్ నొక్కితే ఆయన పేరు, ఫోన్ నెంబరు వివరాలు తెలుస్తాయి. అలాగే కంపెనీల జాబితాలో ఏ బ్లాక్‌లో ఏ కంపెనీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నది తెలుస్తుంది.
ఉద్యోగార్థులు ఇక్కడ కేవలం ఒకే కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు కావాలని లేదు. వారికున్న అర్హతలను బట్టి, ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలకు అయినా హాజరు కావొచ్చు.ప్రతి బ్లాక్‌లో హెల్ప్ డెస్క్, ఇంటర్నెట్, జీరాక్స్ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. అభ్యర్థులకు మంచినీరు, మజ్జిగ, భోజన సదుపాయం కూడా అందుబాటులో ఉంది. జాబ్‌మేళాలో ఉద్యోగాలు రాని వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.