Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ప్రభుత్వానికి సినిమా థియేటర్ల (Movie Theatres) కు మధ్య వార్ జరుగుతోంది. ఆన్ లైన్ టికెటింగ్ (Online Movie Tickets), బెనిఫిట్ షోల రద్దుతో మొదలైన వివాదం.. టికెట్ రేట్ల తగ్గింపు తర్వాత మరింత ముదిరింది. దీంతో చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య భారీ అంతరం ఏర్పడింది. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జీ.ఓ నం.35 జారీ చేసిన వెంటనే థియేటర్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి పాతపద్ధతిలో టికెట్లు విక్రయించుకునేలా ఆర్డర్స్ తెచ్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సినిమా ధియేటర్లను A,B,C క్లాస్ లు గా విభజించి ఆయా ప్రాంతాలను బట్టి ధరలను నిర్ణయించడంతో పెద్ద దుమారమే రేగింది. మునుపెన్నడూ లేని విధంగా టికెట్ ధరలను 5, 10, 20, 50, 100 రూపాయలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో ధియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తిపోయాయి.
ప్రభుత్వం అమలు సూచించిన ధరలను అమలు చేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని.. థియేటర్లు మూసివేయాల్సిందేనని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే థియేటర్లలో పనిచేసే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయంటూ వాపోతున్నారు.
థియేటర్ కు ఎలాంటి అనుమతులు కావాలి..?
సాధారణంగా ఒక సినిమా థియేటటర్ నిర్మించి దాన్ని సజావుగా నడిపించాలంటే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అవి ఏంటంటే..!
వీటి కోసం చలానాల రూపంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఐతే కొందరు అధికారులకు ముడుపులు కూడా చెల్లించాల్సి వస్తోందని థియేటర్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
ధరల నియత్రణ ప్రభావం ఎంత..?
ఇక సినిమా థియేటర్ ప్రారంభించిన తర్వాత నిర్వహణకు భారీగానే ఖర్చవుతుంది. విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు, స్క్రీన్, ప్రొజెక్టర్ మెయింటెనెన్స్ ఛార్జీలు, పన్నులు, ఇతర ఖర్చులు చాలానే ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ధియేటర్లు నడపడం కష్టతరం అవుతుందంటున్నారు యాజమాన్యాలు.
ప్రస్తుత టికెట్ ధరలతో సుమారుగా వచ్చే ఆదాయం
సగటున ఒక్కో సినిమా థియేటర్లో సగటున 350 సీట్లు ఉండే ధియేటర్ లో టికెట్ సగటు ధర రూ.50 అనుకుంటే ఒక హౌస్ ఫుల్ షోకి 17500/- వసూలు అవుతుంది. నెలంతా హౌస్ ఫుల్ అయితే రూ. 21లక్షల వరకు ఆదాయం వస్తుంది. కానీ ప్రస్తుతమున్న ప్రతి రోజూ థియేటర్ హౌస్ ఫుల్ అయ్యే పరిస్థితి లేదు. ఏడాదిలో ఓ 30-40 రోజులు హౌస్ ఫుల్ అయ్యే అవకాశముంటే.. మిగిలిన 11 నెలలు అరకొర కలెక్షన్లు వస్తాయి. ఈ లెక్కన 30 రోజుల ఆదాయంతో 330 రోజుల పాటు థియేటర్ నడపలేమని యజమానులు లేల్చిచెబుతున్నారు.
కరెంటు బిల్లు, జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు, అనుమతులకు నెలకు నాలుగు లక్షలు ఖర్ఛు ఖర్చవుతోంది. దీనికి అదనంగా అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులకు ఉచితంగా టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక ఒక్కో ధియేటర్ నిర్మాణానికి తక్కువలో తక్కువ రూ.10 కోట్లు ఖర్చవుతోందని.. ఆ సొమ్ము పై బ్యాంక్ వడ్దీ వేసుకున్నా నెలకు 10లక్షల రూపాయలు వడ్డీ అవుతుందని వెరసి నెల నెలా 20 లక్షలకు పైగా వసూలు ఐతే తప్పించి తాము గట్టెక్కలేమంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా టికెట్ల ఆదాయం ఖర్చులకు పోను క్యాంటీన్ పై వచ్చే ఆదాయమే తను గట్టెక్కిస్తుందని కొందరు థియేటర్ యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వ తనిఖీలు, నిబంధనలతో థియేటర్లు మూసేయాలని చెబుతున్నారు. ఐతే సినిమా హాళ్ల క్యాంటీన్లలో వసూలు చేసే ధరలపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు కరోనా లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడినా విద్యుత్ బిల్లులు చెల్లించామని అందులో 25శాతం బిల్లులు రీయింబర్స్ చేస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.