Home /News /andhra-pradesh /

HERE ARE THE DETAILS ABOUT THE BENEFITS OF LAND REGISTRATIONS AT VILLAGE SECRETARIATS PRN

AP Registrations: ఏపీలోని ఈ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. ప్రయోజనాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకాన్ని (Jagananna Saswatha Bhu hakku Pathakam) ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భూములను రీ సర్వే చేసి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశముంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకాన్ని (Jagananna Saswatha Bhu hakku Pathakam) ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భూములను రీ సర్వే చేసి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశముంది. తొలిదశలో 37 గ్రామసచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లోనే సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.., గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులనే సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమించింది. గ్రామ స్థాయిలోనే రిజి స్ట్రేషన్‌ సేవలందించేందుకు సచివాలయాల్లో సబ్‌ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. రీసర్వే పూర్తయిన గ్రామాలను ప్రస్తుతం ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి వేరు చేసి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో సబ్‌ డిస్ట్రిక్టులుగా ఏర్పాటు  చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

    ఈ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
    శ్రీకాకుళం జిల్లా: శింగన్నవలస, డోల, విజయనగరం జిల్లా: సోంపురం, పెదమనపురం, విశాఖపట్నం జిల్లా: నునపర్తి, చింతపల్లి–1, తూర్పుగోదావరి జిల్లా: పాలగుమ్మి, మాధవపురం, గుడివాడ, భూపాలపట్నం–2, తాళ్లపొలం, బండపల్లి, రంగాపురం, తోగుమ్మి, పెదపుల్లేరు, కృష్ణా జిల్లా: పోతిరెడ్డిపాలెం, లింగవరం, మర్రిబంధం, షేర్‌ మహ్మద్‌పేట, గుంటూరు జిల్లా: తుమ్మలపాలెం, నడికుడి–3, ఉన్నవ, దుగ్గిరాల–1, ప్రకాశం జిల్లా: శివరామపురం, కొప్పోలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: నువ్వూరుపాడు, దుండిగం, భీమవరం, మొగల్లూరు, చిత్తూరు జిల్లా: అగరమండళం, రామభద్రాపురం, విట్టలం, నర్సింగపురం, కడప జిల్లా: రేగిమానుపల్లె, మొయిళ్లకాల్వ, కర్నూలు జిల్లా: ముసనహల్లి, పందిపాడు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు మొదలయ్యాయి.

    ఇది చదవండి: ‘చింతామణి నాటకం’పై నిషేధం ఎందుకు..? ఆ వర్గం అభ్యంతరాలు ఇవేనా..!


    శాశ్వత భూ హక్కుశాశ్వత భూ హక్కు

    •  సింగిల్‌ విండో పద్దతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీ దిశగా అడుగులు

    •  భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు ఇకపై సులభం


    భూ రక్ష

    • ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళుప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళు

    • డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు చెక్‌

    • దళారీ వ్యవస్ధ ఇక రద్దు, లంచాలకు ఇక చోటు లేదు


    ఇది చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై సీఎం ట్వీట్.. జగన్ ఏమన్నారంటే..




    భద్రత

    • నకిలీ పత్రాలకు ఇక తావులేదు• నకిలీ పత్రాలకు ఇక తావులేదు

    • భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడవు

    • భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులు

    • అవసరమైన చోట సబ్‌ డివిజన్‌ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు


    పారదర్శకత

    • సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం

    • మండల మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం

    • తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్తిరాస్తుల సర్వే మరియు యాజమాన్య ధృవీకరణ పత్రాల జారీ


    గ్రామాల చెంతకే సేవలు

    • ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్‌ లైన్‌ దరఖాస్తులు 15 రోజుల్లో, పట్టా సబ్‌ డివిజన్‌

    • దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కారం

    • ఇకపై గ్రామ సచివాలయాల్లో కూడా స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్లు

    • భూ సమాచారాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడినుంచైనా పొందవచ్చు


    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Land registration, Village secretariat

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు