నూతన విద్యాసంవత్సరం (Academic Year-2022-23) మొదలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు పడుతున్నాయి. ఈ తరుణంలో అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలు విద్యార్థులు, అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటారా.. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాలకు అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (EWS)) కింద ఈ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నాలుగేళ్ల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ EWS సర్టిఫికేట్ల జారీ కొనసాగుతుంది. ఒక్క విద్యా సంస్థలకే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. మరి కొత్తవాళ్లకు ఈడబ్యూఎస్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి..ఎవరిని సంప్రదించాలి?లాంటి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి..అలాంటి వారి కోసమే ఈ కథనం..
EDW సర్టిఫికేట్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రస్తుతం ప్రతి ఊరికి గ్రామ,వార్డు సచివాలయాలు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు..ఏ సర్టిఫికేట్ కావాలన్నా సులభంగా దొరుకుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే.. మీ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాలకు గానీ, మీ సేవా కేంద్రాలకు గానీ వెళ్లి… సంబంధిత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దానికి మీరు మీ ఆధార్ కార్డు (Adhar card), ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్‌లు ( Educational Certificate), టీసీ (TC), బర్త్ సర్టిఫికేట్(Birth certificate) కుటుంబ ఆస్తులకు సంబంధించిన నోటరీ అఫిడవిట్, ఫొటో..లాంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
మీరు దరఖాస్తు చేసుకోగానే మీ మొబైల్ నెంబర్‌కు మెసెజ్ వస్తుంది. ఆ తర్వాత వీఆర్వో (VRO), ఆర్‌ఐ(RI) మీరు ఇచ్చిన సర్టిఫికేట్‌లను అన్నిటిని పరిశీలించి.. ఆ వివరాలను తహసీల్దార్‌కు పంపుతారు. మీరు ఇచ్చిన వాటిలో ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే.. మిమ్మల్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఆమోదిస్తారు.
ఆ తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల నుంచే మీకు ఆ EDW సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ సర్టిఫికేట్ మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారం నుంచి నెల రోజులలోపు వచ్చేస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్న దగ్గర నుంచి ప్రతి ప్రాసెస్ మీకు ఫోన్‌కు టెక్ట్స్ మెసెజ్ రూపంలో వస్తుంది. దాన్ని బట్టి, మీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉందో ఈజీగా ట్రాక్ చేయోచ్చు.
ఈడబ్ల్యూఎస్‌కు ఎవరెవరు అర్హులు..?
విద్యాసంవత్సం ప్రారంభమవడటంతో.., విద్యార్థులకు ఎలాంటి ఆలస్యం చేయకుండా త్వరగా అర్హులందరికీ తహశీల్దార్లు ఈ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. మీరు ఇంకా అప్లయ్‌చేసుకోకపోయి ఉంటే త్వరగా మీ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, EBC Reservation