Home /News /andhra-pradesh /

HELP MIGRANT WORKERS AP HIGH COURT ORDERED STATE GOVERNMENT AK

వలస కార్మికులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    వలస కార్మికులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిని ఆదుకుని, నగదు, ఆహార భద్రత కల్పించాలని సూచించింది. ఈ వలస కార్మికుల సమస్యలపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ విధంగా తీర్పు వెలువరించింది. కాగా, హైకోర్టు తీర్పు పట్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వలస కార్మికులను ఆదుకుని, వారికి ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

    మరోవైపు వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలే తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తరలించేందుకు అవసరమైన సదుపాయాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. చాలా మంది కాలినడక సొంతూర్లకు వెళుతున్నారని, వారంతా రోడ్లపై, రైల్వే ట్రాక్‌లపై నడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహారంతో పాటు షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్రం లేఖలు రాసినట్లు తెలిపారు. కాగా, వలస కార్మికుల కోసం బస్సుల నడపాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Migrant Workers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు