ఏపీ, తెలంగాణలో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు

అయితే ఈ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 18, 2019, 8:52 AM IST
ఏపీ, తెలంగాణలో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో పశ్చిమమధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో వానలు విపరీతంగా కురుస్తున్నాయి. అయితే ఈ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయలసీమతో పాటు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

మరోవైపు భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆయ ప్రాంతల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు బాగానే కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో నిన్న రాత్రి నాన్ స్టాప్‌గా మూడుగంటలపాటు వర్షం దంచికొట్టింది.
Published by: Sulthana Begum Shaik
First published: September 18, 2019, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading