Weather Report: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వానలు (Heavy rains) ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆకాశానికి చిల్లు పడినట్లు నెల్లూరు జిల్లా (Nellore District) వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కుంభవృష్టిగా పడింది. గ్యాప్ ఇవ్వకుండా వానలు కురిశాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ భయం నుంచి ఇంకా తేరుకోకముందే మరో హెచ్చరిక అందుతోంది. తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం మీద రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. క్రమంగా నవంబర్ 18వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో.. రాబోయే మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు భారీగా వీచే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు.. ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఇక రాయలసీమ ప్రాంతంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గత నాలుగైదు రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయని అనుకునేలోపు మరోసారి రాష్ట్రాన్ని వానలు ముంచెత్తనున్నాయి. రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాయలసీమ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చిల్లకూరు మండలం తిప్పాగుంటపాళెం వద్ద ఉప్పుటేరువాగు పారుతుండటంతో అప్రమత్తమైన గూడూరు ఆర్డీవో కిరణ్కుమార్ సోమవారం పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తగా ఓ కమిటీని నియమించి రోప్ సహాయంతో వాగును ఎలా దాటాలో అగ్నిమాపక సిబ్బంది ట్రయిల్ నిర్వహించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు డివిజనల్, మండల స్థాయి సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. చిల్లకూరు తహసీల్దారు స్వర్ణలత, ఎంపీడీవో విష్ణు, చిరంజీవి , సీఐ దశరథరామయ్య, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలో గత నాలుగు రోజులు ముసురు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల జిల్లాలోని పలు రోడ్లు జలమయ్యాయి తిరుపతికి దాహర్తి అందిస్తున్న కళ్యాణి డ్యాంలో భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో డ్యాం నుండి అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాల్లోని కోట మండలంలో అత్యంధికంగా 131.2 మిల్లీమీటర్ల వర్షపాతం, ఎర్రవారిపాలెం మండలంలో 1.0 మిల్లీమీటర్లు నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Weather report