హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Heavy Rains: బాబోయ్ వానలు.. ఏపీకి పొంచి ఉన్న జవాద్ ముప్పు. వెనక్కి వెళ్తున్న సముద్రం

Heavy Rains: బాబోయ్ వానలు.. ఏపీకి పొంచి ఉన్న జవాద్ ముప్పు. వెనక్కి వెళ్తున్న సముద్రం

ఆ నాలుగు జిల్లాలపై వరుణుడు పగ పట్టాడా అన్న స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. మొన్న కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, కడప, అనంపురం, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. చెరువు కట్టలు తెగిపడ్డాయి. దీంతో పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. ఆ వరద నుంచి నాలుగు జిల్లాలు ఇంకా పూర్తిగా తేలుకోలేదు.. ఇప్పుడు మరో హెచ్చరిక జారీ కావడం ఆందోళన పెంచుతోంది.

ఆ నాలుగు జిల్లాలపై వరుణుడు పగ పట్టాడా అన్న స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. మొన్న కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, కడప, అనంపురం, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. చెరువు కట్టలు తెగిపడ్డాయి. దీంతో పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. ఆ వరద నుంచి నాలుగు జిల్లాలు ఇంకా పూర్తిగా తేలుకోలేదు.. ఇప్పుడు మరో హెచ్చరిక జారీ కావడం ఆందోళన పెంచుతోంది.

Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సముద్రం ఏదో మెసేజ్ ఇస్తోంది.. ఒకసారి ఊహించని విధంగా ముందుకు వస్తోంది. అలాగే సడ్ న్ గా సముద్రం వెనక్కు వెళ్లిపోతోంది. ఇటవల తరచూ చాలాచోట్ల ఇలానే జరుగుతోంది. కొందరైతు ఏవో ప్రమాద హెచ్చరికలు అంటున్నారు. మరి కొందరు ఇది రొటీన్ గా జరిగేదే అంటున్నారు..

ఇంకా చదవండి ...

Heavy Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వానలు ముంచెత్తుతున్నాయి. వర్షాకాలం వదిలినా వానలు మాత్రం వదల బొమ్మాళి అంటున్నాయి. మొన్నటికి మొన్న బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ కారణంగా నాలుగు జిల్లాల్లో వానలు దంచి కొట్టగా.. రెండు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా (Chitoor District).. నెల్లూరు జిల్లా (Nellore District)లను ఎడతెరిపి లేని వానలు (Heavy Rains) భయపెడుతున్నాయి.  ఆ పరిస్థితి నుంచి తేరుకోక ముందే మరో ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు అందుతున్నాయి.  మరోమూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది..

థాయ్‌లాండ్, అండమాన్‌ నికోబార్‌ తీరం దగ్గర శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తరువాత మరింత బలపడి.. ఏపీ తీరంలో 17, 18 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి: వివాదాలు.. వినతులు.. నేడు తిరుపతిలో అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్ మీట్..

తుపానుగా మారాక దీనికి ‘జవాద్‌’గా నామకరణం చేయనున్నారు. విశాఖ, కాకినాడ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఏపీ తీరానికి 1,200 కి.మీ. దూరంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. 15వ తేదీ నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: సోలార్ ఉన్నా చలినీళ్లతోనే విద్యార్థుల స్నానాలు.. ఎందుకంటే?..?

విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17 నుంచి తీరం దాటే వరకూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పదవి కోసం ఫైట్.. వాట్సప్ లో వైరల్ పోస్టులు

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఎవరూ వేటకు వెళ్లొద్దని, వేటకు వెళ్లిన వారు 15వ తేదీలోపు తిరిగి వెనక్కి వచ్చేయాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వైపు వచ్చి మరింత బలహీనపడింది. మయన్మార్‌కు సమీపంలో ఏర్పడిన అధిక పీడన ప్రాంతం కారణంగా ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంపై బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల రెండ్రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలూ కురవొచ్చు.

ఇదీ చదవండి: తిరుమల మరో ఘనత.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు

మరోవైపు  విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో సముద్రం శనివారం 100 అడుగుల లోపలకు వెళ్లింది. అలల తాకిడి సైతం తగ్గింది. వాయుగుండం, ఆటు పోట్ల ప్రభావంతో నీరు వెనక్కి వెళ్లినట్టు మత్స్యకారులు చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Rains, Weather report

ఉత్తమ కథలు