48 గంటల్లో అల్పపీడనం తీవ్రం ... రెండురోజులు భారీ వర్షాలు

రెండు రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: August 6, 2019, 10:21 AM IST
48 గంటల్లో అల్పపీడనం తీవ్రం ... రెండురోజులు భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో తీవ్రంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువున ఉన్న రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీ తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. ఈ పరిస్థితి ఇలాగే మరో రెండు రోజుల కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలకు రోడ్లలపై గుంతలు ఏర్పడ్డాయి.

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయంకు జలశోభతో కళకళలాడుతోంది. మరో నాలుగు రోజులు వరద కొనసాగితే, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ తో పాటు హంద్రీనీవాకు, తెలుగుగంగ కెనాళ్లకు నీరందించే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వస్తున్న నీటిపై రాయలసీమ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 125 టీఎంసీల నీరు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 2,62,064 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇదే నీటి ప్రవాహం కొనసాగితే, రోజుకు 25 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు