వచ్చే 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.

  • Share this:
    వానాకాలం సీజన్ ప్రారంభమయ్యింది. ఇప్పటికే అక్కడక్కడ గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లోని రైతాంగం వర్షాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో వారికి ఊరటనిచ్చే న్యూస్‌ను వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. అందులో భాగంగానే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతవరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. అయితే శుక్రవారం నుంచి సోమవారం వరకు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుంటూరు, ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి చిరు జల్లులు పడే అవకాశం ఉంది.
    First published: