బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

పశ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

news18-telugu
Updated: August 13, 2019, 7:55 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరంలోని వాయవ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. అలాగే 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ఉపరితల భాగం నైరుతి వైపు వంగి ఉన్నట్లు ఐఎండి తెలిపింది. ఇది మరింత బలపడి 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వివరించింది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం కోస్తాలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడా, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగనరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.
Published by: Krishna Adithya
First published: August 13, 2019, 7:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading