Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను ఇప్పట్లో భారీ వానలు (Heavy Rains) వదిలా లేవు. ఇప్పటికే గులాబ్ తుఫాను(Gulab cyclone)ఉత్తరాంధ్ర సహా మొత్తం ఆరు జిల్లాలను గజగజా వణికించింది. ఆ భయం ఇంకా వీడకముందే ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) తీరప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో బలపడే అవకాశం ఉంది. దీంతో తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం ఉత్తరకొంకన్ ప్రాంతము నుంచి నైరుతి విదర్భ, ఉత్తరకోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: సినీ పరిశ్రమకు పవన్ పెద్ద గుదిబండ.. ఆయన్ను పెద్దలు పక్కన పెట్టారన్న సజ్జల
మరోవైపు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఇక రాయలజీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఇదీ చదవండి: కోనసీమవాసుల్లో టెన్షన్ టెన్షెన్.. ప్రమాదం పొంచి ఉందా..? తూనీగలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి..?
అయితే ఇప్పటికే ఏపీలో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణం నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గులాబ్ తుపాను విజయనగరం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా పొంగుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. రహదారులు నీట మునిగాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను కారణంగా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రెచ్చిపోతున్న పోకిరీలు.. ర్యాష్ డ్రైవింగ్.. తుపాకీ స్టంట్లతో అలజడి
గులాబ్ తుపాను పశ్చిమగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రహిస్తున్నాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో అక్కడక్కడ గండ్లు పడ్డాయి. దెందులూరు-సత్యనారాయణపురం మధ్య జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. పొలాల్లోకి నీరు చేరడంతో పంటలకు నష్టం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, WEATHER, Weather report