హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు..

ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, పడమర తీరంలో ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల బుధవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి.

    రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, పడమర తీరంలో ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల బుధవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. మామిడివలస(అరకువేలీ), కోటనందూరు, జియ్యమ్మవలస, ఏలేశ్వరంలలో 70, చాట్రాయిలో 57, కామవరపుకోట 53, వడ్డాది, బుచ్చయ్యపేట 52, పాచిపెంట,  రంగాపురం, సీతానగరంలలో 50, దేవరాపల్లిలో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

    Published by:Anil
    First published:

    Tags: Andhra Pradesh, IMD, Rain alert

    ఉత్తమ కథలు