Home /News /andhra-pradesh /

HEAVY RAINS HITS FOUR DISTRICT IN ANDHRA PRADESH TIRUPATI COMPLETELY IN WATER NGS TPT

Heavy Rains: ఎటు చూసినా భయం భయం.. జలదిగ్బంధంలో రెండు జిల్లాలు.. స్వర్ణముఖి నది ఉగ్రరూపం

స్వర్ణముఖి నది ఉగ్రరూపం

స్వర్ణముఖి నది ఉగ్రరూపం

Heavy Rains: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో మూడు రోజుల పాటు వానలు పడతాయనే హెచ్చరికలు రెండు జిల్లాలను భయపెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తిరుపతి పూర్తిగా నీట మునిగింది. స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది.

  Heavy Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ కారణంగా నాలుగు జిల్లాల్లో వానలు దంచి కొట్టగా.. రెండు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా (Chitoor District).. నెల్లూరు జిల్లా (Nellore District)లను ఎడతెరిపి లేని వానలు (Heavy Rains)భయపెడుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో కాజ్‌వే దాటుతుండగా వరదనీటిలో కొట్టుకుపోతున్న భార్యాభర్తలు సహా మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. ఏర్పేడు మండలం శ్రీకాళహస్తి-పాపానాయుడు పేట ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. సాయంత్రం వేదాంతపురం స్వర్ణముఖి నదిలో భార్య, భర్తతో పాటు.. వారి ఏడాది పిల్లాడు నదిలో చిక్కుకుపోయారు. కాజ్‍‌ వే దాటుతున్న సమయంలో అందులో కొట్టుకుపోయారు. స్థానికులు గుర్తించి.. ఆ ముగ్గురిని గట్టుకు తీసుకువస్తుండగా.. నీటి ప్రవాహానికి మరోసారి అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయారు. దీంతో మరింత అప్రమత్తమైన స్థానికులు.. అధికారులతో కలిసి సహాయక చర్యలు నిర్వహించారు. ఆకలిదప్పులతో అరుస్తూ.. అక్కడే ఉన్న వారిని తాళ్ల సాయంతో అతి కష్టం మీద రక్షించారు. భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద చేరింది. దీంతో అధికారులు 11 గేట్లు ఎత్తి 15000 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. భారీ వర్షాల ప్రభావంతో బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి బ్రిడ్జి పై 5 అడుగులు పైన నీరు ప్రవహించటంతో వాలమేడు. పుచ్చలపల్లి. జెమీన్ కొత్తపాలెం, తూపిలిపాలెం,అందలమల గ్రామాలకు రాకపోకలు అధికారులు నిలిపివేశారు.

  మరోవైపు స్వర్ణముఖి బ్యారేజ్ దిగువ ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే పులికాట్ సరస్సు పొంగడంతో పంబలి. పులేంజరీపాలెం. శ్రీనివాసపురం. వాయట కుప్పం. గ్రామాలకు పూర్తిగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఆగ్రామాల ప్రజలు పడవ ప్రయాణం పై రాకపోకలు సాగిస్తున్నారు.

  ఇదీ చదవండి : ఎందరికో మార్దదర్శిగా మారిన సామాన్యుడు జయదేవ్ భొత్ర.. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?

  భారీ వర్షాల కారణంగా నగరి నియోజకవర్గం నిండ్ర మండలం లోని కొప్పేడు-కావనూరు బ్రిడ్జి తెగినందున ప్రత్యక్షంగా ఆ ప్రదేశానికి హాజరై రహదారుల శాఖ, నీటి పారుదల శాఖ, మండల స్తాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తగు ఆదేశాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా జారీ చేశారు.

  ఇదీ చదవండి :మహా పాదయాత్రపై రాజకీయ మంటలు.. రైతుల ముసుగులో టీడీపీ నేతలే దాడి చేశారన్న మంత్రి పేర్నినాని

  ఇటు తిరుమల గిరుల నుంచి భారీగా వర్షపు నీరు కిందికి చేరుడంతో తిరుపతి జలదిగ్బంధమైంది. పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రుయాతో పాటు శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం, అన్నారావు కూడలి, లక్ష్మీపురం సర్కిల్‌, మధురానగర్‌, ముత్యాలరెడ్డిపల్లెలో నడుము లోతు వరద చేరింది.ఇక తిరుమల పుణ్యక్షేత్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వృక్షాలు నెలకొరగడంతోపాటు ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడ్డాయి. జలప్రసాద కేంద్రంపై, ఎంబీసీ కాటేజీ వద్ద భారీ వృక్షాలు కూలాయి. అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద భారీ వృక్షం కూలి రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

  ఇదీ చదవండి : పుష్పక విమానం డైరెక్టర్‌ దామోదర గురించి ఆ విషయం తెలిస్తే షాక్ అవుతారు.. ఇది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

  అలాగే తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కళ్యాణి డ్యామ్ ఒక్క గేట్లను ఎత్తివేసి నీటిని బయటకు విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. సాయంత్రం 5 గంటలకు నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేసే ముందు గంగ హారతి సమర్పించారు.

  ఇదీ చదవండి :ఏపీలో వైసీపీని వెనక్కు నెట్టిన టీడీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ దే నెంబర్ వన్ ప్లేస్..

  నిన్ని రాత్రి నుంచి ఎడతెరిపి లేని వానలతో తిరుమల గిరుల నుంచి భారీగా వర్షపు నీరు కిందికి చేరింది. దీంతో తిరుపతి జలదిగ్బంధమైంది. పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రుయాతో పాటు శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం, అన్నారావు కూడలి, లక్ష్మీపురం సర్కిల్‌, మధురానగర్‌, ముత్యాలరెడ్డిపల్లెలో నడుము లోతు వరద చేరింది. తిరుమల పుణ్యక్షేత్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వృక్షాలు నెలకొరగడంతోపాటు ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడ్డాయి. జలప్రసాద కేంద్రంపై, ఎంబీసీ కాటేజీ వద్ద భారీ వృక్షాలు కూలాయి. అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద భారీ వృక్షం కూలి రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Kadapa, Nellore, Prakasam, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు