హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Rain Alert: ఏపీని వదలని వానలు.. ఆ మూడు జిల్లాలపై వరుణుడి పగ.. నేడు మరో అల్పపీడనం..

AP Rain Alert: ఏపీని వదలని వానలు.. ఆ మూడు జిల్లాలపై వరుణుడి పగ.. నేడు మరో అల్పపీడనం..

ఆంధ్రప్రదేశ్  మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్ ను వానలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మూడు జిల్లాలపై వరుణుడు పగబట్టాడా అనేలా కుండపోత వానలు కురిశాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.. ఇప్పుడు మరో ముప్పు భయపెడుతోంది. మరోసారి ఆ మూడు జిల్లాలను వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇంకా చదవండి ...

Heavy Rains in AP:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను ఇంకా వరద కష్టాలు వీడలేదు. ఇప్పటికే జనం బిక్కు బిక్కు మంటూనే బతుకుతున్నారు. దీంతో వాన పేరు చెబితేనే కొన్ని ప్రాంతాల్లో భయపడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లా (Rayalaceema districts)లను వరుణుడు ముంచెత్తుతున్నాయి. విరామం లేని వానలతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఆకాశానికి చిల్లు పడిందా అనే లా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. మధ్యలో కాస్త విరామం ఇస్తూ మళ్లీ మళ్లీ వర్షాలు కురిపిస్తున్నాడు. ఇప్పటికీ వరదలు కారణంగా.. నెల్లూరు (Nellore District), చిత్తూరు (Chittoor District), కడప (Kadapa District), అనంతపురం జిల్లాలో (Anantapuram District) నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వార్నింగ్ ఇస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. ఈ ప్రభావం కారణంగా అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక–ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరోసారి నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. ఎందుకో తెలుసా..?

గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు, తిరుపతి నగరాలపై వాన ప్రభావం అధికంగా కనిపించింది. ఇక తిరుపతిలో అయితే చరిత్రో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని స్థానికులు అంటున్నారు. భారీ వర్షాల ప్రభావం తిరుమల పైనా కనిపించింది. వైకుంఠం కాంప్లెక్స్ లోకి కూడా వరద నీరు చేరింది. ఘాట్ రోట్లను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇక నెల్లూరు నగరంలోనూ అదే పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ చెరువులు అయ్యాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి.

ఇదీ చదవండి: సామాన్యుడి ఆహ్వానంపై స్పందించిన సీఎం.. ఆటోలో ఇంటికి వెళ్లి భోజనం.. వైరల్ గా మారిన వీడియో

ఇంకా ఆ భయం నుంచి అక్కడి ప్రజలు తేరుకోక ముందే మరో హెచ్చరిక భయపెడతోంది. తాజా అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీన కడప జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది.

ఇదీ చదవండి: ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. రెండు కేజీల బిర్యానీ తింటే టమాటో ఫ్రీ.. కానీ ఓ కండిషన్

తాజా అల్ప పీడన ప్రభావం కారణంగా ఇవాళ రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. రైతులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అందుతున్నాయి. నేటి నుంచి డిసెంబర్‌ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chitoor, Heavy Rains, Kadapa, Nellore Dist, Rain alert, Weather report

ఉత్తమ కథలు