హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Heavy Rains : బీ అలర్ట్​..రాబోయే 3 రోజులు భారీ వర్షాలు​!

Heavy Rains : బీ అలర్ట్​..రాబోయే 3 రోజులు భారీ వర్షాలు​!

తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

Heavy Rains In AP And Telangana : రాగల 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Heavy Rains In AP And Telangana : రాగల 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి కొమోరిన్‌ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర , కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు.

Biggest Asteroid : మరో 10 రోజుల్లో భూమిపై భారీ విధ్వంసం!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయని వివరించింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Andhra Pradesh, Monsoon rains, Rains, Telangana, Weather report

ఉత్తమ కథలు