Heavy Rain Effects: భారీ వర్షాలతో రైతన్నలకు తప్పని కష్టాలు.. ఉద్యానం చుట్టూ.. తెగుళ్ల ముసురు..

ఉద్యాన పంటలకు తెగుళ్ల ముసురు

Horticultural crops: అన్నదాతల కష్టాలు తప్పడం లేదు. ఉద్యాన పంటలపైనే ఫోకస్ చేయాలని అధికారులు పదే పదే చెబుతున్నారు. అలాగని ఉద్యాన పంటలు వేస్తుంటే.. రైతులకు కష్టాలు తప్పడం లేదు. అరటికి సిగటోకా.. బొప్పాయికి వైరస్‌, జామకు పండు ఈగ దెబ్బ ఇలా తెగుళ్లు పట్టి అన్నదాతలను ఏడిపిస్తున్నాయి.

 • Share this:
  Horticultural crops loss in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధిక వర్షాలు (Heavy Rains) వాతావరణంలో మార్పులతో అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉద్యాన పంటలు (Horticulrural crops)వేసిన రైతులు (farmers)ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ తదితర తోటలను చీడపీడలు చుట్టుముట్టాయి. విదేశాలకు ఎగుమతి చేసినా 15 నుంచి 20 రోజులకు పైగా ఎలాంటి ఇబ్బంది రాని అరటి.. వారం కూడా నిల్వ ఉండటం లేదు. నిగనిగలాడే జామ కాయను.. కోసి చూస్తే పురుగులుంటున్నాయి. ఫలితంగా రైతులు దారుణంగా దెబ్బతింటున్నారు. బొప్పాయికి వైరస్‌ తాకిడి తీవ్రమవుతోంది. మొక్కలు నాటిన కొన్నాళ్లకే ఆకులు పసుపు రంగులోకి మారి గిడసబారుతున్నాయి. నివారణకు మందుల పిచికారీకి ఎకరాకు 20 వేలకు పైగా ఖర్చవుతోందని రైతులు పేర్కొంటున్నారు. పైగా గిట్టుబాటు ధరలూ లభించక పలువురు రైతులు తోటలనే తొలగిస్తున్నారు. ‘వైరస్‌ నివారణకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఏప్రిల్‌లో కిలో 14 రూపాయలు ఉన్న ధర, సెప్టెంబరులో 3 రూపాయలకు పడిపోవడంతో ఎకరాకు 15 టన్నుల పంటను వదిలేయాల్సి వచ్చింది. అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  చెట్టుకే పండిపోతున్న అరటి
  అనంతపురం, కడప, కర్నూలు, కోస్తా జిల్లాల్లో ఎగుమతికి వీలున్న జీ9 రకాన్ని, మిగిలిన చోట్ల నాటు రకాలను సాగు చేస్తున్నారు. సిగటోకా తెగులుతో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. కాయలు చెట్టుపైనే పండిపోతున్నాయి. పంజాబ్‌, హర్యానా, కశ్మీర్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న కాయలు అక్కడ దిగుమతి చేసే సమయానికే పాడవుతున్నాయి. 11 ఎకరాల్లో అరటికి 12 లక్షలు పైనే పెట్టుబడి పెడితే.. అసలు సొమ్ము కూడా చేతికొచ్చేలా లేదని.. గతంలో కిలో 14 నుంచి 15 ఉండే ధర.. ఇప్పుడు 4 రూపాయలకు పడిపోయిందని రైతులు కన్నీరు పెడుతున్నారు.

  ఇదీ చదవండి: మీ పని మాది అంటున్న యాప్స్.. బూజు దులిపే దగ్గర నుంచి హెయిర్ కటింగ్ వరకు అన్నీ ఇంటి దగ్గరే.. ఏపీలో పెరిగిన డిమాండ్

  దానిమ్మకు బ్యాక్టీరియా
  అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో బ్యాక్టీరియాతో దానిమ్మ తోటలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా కాయ పరిమాణం 800 గ్రాముల వరకు వస్తుంది. తెగులు ఆశిస్తే పూర్తిగా నష్టపోవాల్సిందే. ‘వర్షం వచ్చి ఉష్ణోగ్రత పెరిగినా బ్యాక్టీరియా ఆశిస్తే ఆయిల్‌ మరకలా ఏర్పడి... పిందె దశలోనే కాయ పగుళ్లిస్తుంది. కోత దశలో నల్లమచ్చ ఆశిస్తోంది. ఇది తీవ్రంగా నష్టపరుస్తోంది.

  ఇదీ చదవండి: దసరా అంటే అక్కడ కర్రల సమరం.. అదే దేవరగట్టు స్పెషల్.. ఎందుకు కొట్టుకుంటారో తెలుసా..? ఈ సారి అడుగడుగునా ఆంక్షలు

  కాయ కోస్త లోపల పరుగులే..
  ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు పలుచోట్ల తైవాన్‌ పింక్‌, వైట్‌ రకాల జామను పండు ఈగ కాటేస్తోంది. కాయ పైకి బాగానే కన్పిస్తున్నా లోపల పుచ్చిపోతోంది. ఈ ఈగ పచ్చికాయనూ నాశనం చేస్తోంది. ‘మూడున్నర ఎకరాలు వేశాను. రెండో కాపులో పురుగు పట్టేయడంతో రైతులు లబొ దిబో అంటున్నారు. కాయలపై చిలక కాటు మాదిరిగా.. కంటికి కనిపించని రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ప్రతి పది కిలోలకు మూడు కిలోల వరకు దెబ్బతింటున్నాయి.
  Published by:Nagesh Paina
  First published: