తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... నాలుగురోజులు వానలే వానలు

కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

news18-telugu
Updated: September 16, 2019, 9:10 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... నాలుగురోజులు వానలే వానలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో ఃపలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. 19వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవాకశాలున్నాయని అధికారులు తెలిపారు.  తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే, ఈ సంవత్సరం మూడు శాతం తక్కువగా వర్షాలు కురిశాయన్నారు.

కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్గాలకు అవకాశముందని అధికారులు తెలిపారు. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.  శనివారం  నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాతావరణమంతా పొడిగా ఉండి విషజ్వరాలు కూడా అధికంగా ప్రబలుతున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు డాక్టర్లు.
Published by: Sulthana Begum Shaik
First published: September 16, 2019, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading