ఏపీలో ఇవాళ, రేపు భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


Updated: December 1, 2019, 12:43 PM IST
ఏపీలో ఇవాళ, రేపు భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చలికాలం వచ్చిన తెలుగురాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. మరోసారి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది.
First published: December 1, 2019, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading