ఏపీకి భారీ వర్షాలు... పిడుగులు పడే అవకాశం

పలు ప్రాంతాల్లో వానలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: November 19, 2019, 11:28 AM IST
ఏపీకి భారీ వర్షాలు... పిడుగులు పడే అవకాశం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీతో పాటు యానాం, పుదుచ్చేరి, కరైకల్‌ తమిళనాడు ప్రాంతాల్లో కూడా భారీ వానలు కురుస్తాయని తెలపింది. కోస్తా ఆంధ్ర యానాం, రాయలసీమ ,పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయనంది. పలు ప్రాంతాల్లో వానలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఐఎండి బులిటెన్‌ను విడుదల చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో బుధవారం కూడా భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరించారు. హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర వాతావరణ శాఖ అధికారులు
Published by: Sulthana Begum Shaik
First published: November 19, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading