ఏపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 24గంటల్లో ఏపీ తెలంగాణతో పాటు కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరించారు.