ఏపీ, తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

news18-telugu
Updated: November 20, 2019, 4:43 PM IST
ఏపీ, తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వానకాలం ముగిసింది... వింటర్ కూడా ప్రారంభమైంది. చలితీవ్రత కూడా ఎక్కువైంది. అయితే ఈ సమయంలో సీజన్‌కు వ్యతిరేకంగా మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాలకు మళ్లీ
భారీ వర్షాలు వస్తాయన్నారు. ఏపీ తెలంగాణలో రానున్న మూడు రోజులు అక్కడడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

ఆ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య దిశ నుండి చలి గాలులు వీస్తున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.రాయలసీమలో మాత్రం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>