AP Weather: ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో.. వాతావరణశాఖ వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

AP Weather Report: రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Share this:
    పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణా కోస్తాలోనూ వాతావరణం ఇదే రకంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. కృష్ణా జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని... గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురివొచ్చని వెల్లడించింది. రాయలసీమలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
    Published by:Kishore Akkaladevi
    First published: