రానున్న మూడు రోజుల్లో పిడుగులు.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

జూన్12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, రాయలసీమలో చెదురు మదురుగా తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ చెప్పారు.

news18-telugu
Updated: June 11, 2020, 2:54 PM IST
రానున్న మూడు రోజుల్లో పిడుగులు.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
  • Share this:
కోస్తాంధ్ర ప్రాంతంలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సూచించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో బలపడనుంది. ఈ ప్రభావం వల్ల గురువారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు. తీరంవెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచించారు. జూన్12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, రాయలసీమలో చెదురు మదురుగా తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.

జూన్13న కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉన్నందున కోస్తాంధ్ర జిల్లాల అధికారులను విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమీషనర్ పేర్కొన్నారు. ఈ మూడు రోజులు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగులు సైతం పడే అవకాశం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద, చెరువుల వద్ద, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండోద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల శాఖ కమిషనర్ పేర్కొన్నారు.
Published by: Narsimha Badhini
First published: June 11, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading