విజయవాడ, విశాఖ వెళ్లే విమానాలు గంటపాటు ఆలస్యం

విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, వెళ్లాల్సిన విమానాలు కూడా గంట పాటు ఆలస్యంగా వెళ్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

news18-telugu
Updated: October 22, 2019, 10:06 AM IST
విజయవాడ, విశాఖ వెళ్లే విమానాలు గంటపాటు ఆలస్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పలు రోజులుగా హైదరాబాద్‌లో పొద్దున్నే పొగమంచు కమ్ముకుంటుంది.దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.దట్టమైన పొగమంచుతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పై తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.ఇక మంగళవారం పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లాల్సిన టైగర్ ఎయిర్ లైన్స్ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, వెళ్లాల్సిన విమానాలు కూడా గంట పాటు ఆలస్యంగా వెళ్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>