హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Weather: వరుణుడిని లైట్ తీసుకుంటున్నారా..పిడుగు లాంటి వార్త! జాగ్రత్తగా లేకపోతే సీన్‌ సితారే

Weather: వరుణుడిని లైట్ తీసుకుంటున్నారా..పిడుగు లాంటి వార్త! జాగ్రత్తగా లేకపోతే సీన్‌ సితారే

File

File

వరుణుడిని తక్కువ అంచన వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. అసలే సీజన్‌ కానీ సీజన్‌.. ఈ సమయంలో వానదేవుడు విరుచుకుపడితే పంట గల్లంతయ్యే ఛాన్స్‌ ఉంటుంది..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

ఆ వర్షాలు పడవులే.. ఎండే ఉంటుందిలే.. లైట్ లే.. ఏం కాదు లే.. అని లైట్ తీసుకుంటున్న రైతులు ఎవరైనా ఉంటే ఈ వార్త మీకోసమే..! ఏపీలో రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండ వేడిమికి అల్లాడుతున్న జనానికి కాస్త ఊరట లభించింది. రేపు కూడా పలు జిలాల్లో వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం తెలిపింది.

రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు , పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం , అనకాపల్లి, కాకినాడ , కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది. అలాగే పలు చోట్ల భారీ వర్షాలు, పిడుగుపాటు అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పెద్దగా వర్షం పడదన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.. ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం.. నిమిషంలోపే అంతా తారుమారయ్యే అవకాశాలుంటాయి. చిన్న వర్షమే కదా అని కూడా లైట్ తీసుకోవద్దు... ముఖ్యంగా రైతులు చాలా అలెర్ట్‌గా ఉండాలి.. వరుణుడిని తక్కువ అంచన వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. అసలే సీజన్‌ కానీ సీజన్‌.. ఈ సమయంలో వానదేవుడు విరుచుకుపడితే పంట గల్లంతయ్యే ఛాన్స్‌ ఉంటుంది.. ఆరుగాలం కష్ట పడి పండించిన శ్రమంతా వృధా అవ్వకుండా ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, వర్షాలకు ఇదే కారణమని వివరించారు. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల విస్తారంగా, మరికొన్ని చోట్ల వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాకాలాన్ని తలపిస్తోంది.

First published:

Tags: Rains, Srikakulam, Visakhapatnam, WEATHER

ఉత్తమ కథలు