ఏపీ హైకోర్టులో వాడివేడి వాదనలు...

ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు పెంపునకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.

news18-telugu
Updated: May 28, 2020, 9:57 PM IST
ఏపీ హైకోర్టులో వాడివేడి వాదనలు...
ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు పెంపునకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీజుల విధానాన్ని రాష్ట్రంలోని 282 కాలేజీల్లో 23 కాలేజీలు అంగీకరించలేదు. దీనిపై ఆయా కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. దీనిపై ఫీజులను ఫిక్స్ చేసింది తామే కాబట్టి, తాము కూడా పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతామంటూ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కోర్టును కోరింది. దీనికి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కమిషన్‌ను ఇంప్లీడ్‌ చేయని పక్షంలో, ప్రభుత్వ తరఫు నుంచి తమ వాదనలు వినాలని అడ్వొకేట్‌ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం వాదించారు. ఆయితే, సర్కారు వాదన వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు సమాయత్తం కావడంపై ఏజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమ (ప్రభుత్వ) వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ప్రజల ధనం లూటీ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే అని అడ్వకేట్‌ జనరల్ వాదించారు. ప్రజల ధనాన్ని, ప్రజల ప్రయోజనాలన్ని కాపాడాల్సిన బాధ్యత, విధి కోర్టులపై ఉందని స్పష్టం చేశారు.

‘హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ నిర్ధారించిన ఫీజులను ఒప్పుకోకుండా గతంలో అక్రమ పద్దతుల్లో ఖరారుచేసిన ఫీజులను ఇవ్వాలనడం ప్రజల ధనాన్ని లూటీ చేయడమే. 2 ఏళ్లనుంచి ఆయా కాలేజీలకు డబ్బు రాలేదు, కాని ఇప్పుడు 2 రోజుల్లోనే ఏమైపోతుంది?. కోర్టులకు రెండు రోజుల్లో సెలవులు వస్తాయనగా ఇంత అర్జంటుగా, తుదివిచారణ చేయకుండా, కమిషన్‌ వాదన వినకుండా, పిటిషనర్లు కోరిన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదు. కూలంకషంగా వాదనలు విని ఉత్తర్వులు ఇస్తే.. బాగుంటుంది. హైకోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులుకూడా సహజంగా తుది తీర్పులో ప్రతిఫలించాలి. కాబట్టి నా వాదనలు వినాలి.’ అని ఏజీ కోర్టును కోరారు.

పిటిషన్లు దాఖలు చేసిన వ్యక్తులు విద్యారంగాన్ని వ్యాపారమయం చేశారని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. వీరంతా విద్యని వ్యాపారం చేసి వాళ్లు ధనవంతులుగా మారారని, బిజినెస్‌ టైకూన్లుగా మారారని, ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేశారని వివరించారు. వారి దోపిడీలకు కోర్టులు అనుమతి ఇవ్వకూడదన్నారు. ఈ అక్రమాలను అన్నింటినీ కూలంకషంగా విని, తర్వాత తుది ఉత్తర్వులు ఇవ్వాలని, మధ్యంతర ఉత్తర్వులు వద్దని కోర్టును కోరారు.
First published: May 28, 2020, 9:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading