కమిలిపోతున్న శరీరాలు.. ఎండ తీవ్రత, వడగాలులతో ప్రజల బెంబేలు..

ప్రతీకాత్మక చిత్రం

ఉదయం నిద్ర లేచిప్పటి నుంచి మొదలు.. అర్ధరాత్రి 12 గంటల వరకు సూర్యుడి వేడికి భూమి సెగలు కక్కుతోంది. కాలు తీసి బయట పెడదామంటే అరికాళ్లు కాలిపోతున్నాయి. మాడు పగిలేంత ఎండ తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

  • Share this:
    ఉదయం నిద్ర లేచిప్పటి నుంచి మొదలు.. అర్ధరాత్రి 12 గంటల వరకు సూర్యుడి వేడికి భూమి సెగలు కక్కుతోంది. కాలు తీసి బయట పెడదామంటే అరికాళ్లు కాలిపోతున్నాయి. మాడు పగిలేంత ఎండ తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అన్ని నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని చురులో ప్రపంచంలోనే అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యూపీలోని బందా, హరి యాణాలోని హిసార్‌ నగరాల్లోనూ 48 డిగ్రీలు, ఢిల్లీలో 47.6, బికనేర్‌లో 47.4, గంగానగర్‌, ఝాన్సీ నగరాల్లో 47, పిలానీలో 46.9, నాగ్‌పూర్‌ సోనేగావ్‌లో 46.8, అకోలాలో 46.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 46.3 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని కడపలో గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    ఇదిలా ఉండగా, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. బుధవారం నాటికే అవి ఆ ప్రాంతాలకు చేరుకున్నాయి. అయితే, తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: