Home /News /andhra-pradesh /

HEAT IN MAA ELECTIONS ACTOR PRAKASH RAJ FIRE ON MANCHU VISHUN PANEL WILL CM JAGAN COME FOR ELECTIONS NGS

Prakash Raj: ఏపీ సీఎం జగన్ మీ బంధువైతే.. “మా” ఎన్నికలకు వస్తారా? ఓటేసి గెలిపిస్తారా..?

మంచు విష్ణు ప్యానెల్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

మంచు విష్ణు ప్యానెల్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

MAA ELECTIONS: మా ఎన్నికల ప్రచారంలో దూకుడు పెరిగింది. వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకుంటూనే.. మరోవైపు మాటల దాడి పెంచుతున్నాయి రెండు వర్గాలు. పోటీ మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్యే ఫిక్స్ అయ్యింది. దీంతో ఎవరికి వారు దూకుడుగా దూసుకుపోతున్నారు.

ఇంకా చదవండి ...
  Prakash Raj On Manchu Vishnu: తెలుగు సినిమా సభ్యులంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే  "మా" ఎన్నికలకు సమయం దగ్గర పడింది. పోటీ ఎవరి మధ్య అన్నది తేలిపోయింది. దీంతో గెలుపు కోసం మంచు విష్ణు (Manchu Vishnu)ప్యానెల్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో ప్రస్తుతం మా ఎన్నికలు (MAA ELECTIONS) హీటెక్కాయి. ఓ వైపు మంచు విష్ణు ప్యానెల్ దూకుడుగా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వేగంగా మీటింగ్‌లు పెట్టుకుంటూ ఓటర్లను కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాన అభ్యర్థులుగా ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల విమర్శలు ఘాటెక్కాయి. లేటెస్ట్‌గా ఎఫ్ఎన్‌సీసీలో జరిగిన లంచ్ మీట్‌లో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఎలాంటి పెద్దల ఆశీర్వాదం నాకొద్దని చెప్పిన ప్రకాష్ రాజ్.. మేం ప్రశ్నించకపోతే ఈసారి ఎన్నికలు ఉండేవి కావని గుర్తు చేశారు. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారని, తాను ఒక ఉత్తరం రాస్తే తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (Maa Association)కు తాళం పడేదన్నారు. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తనకు తెలుసన్నారు ప్రకాష్ రాజ్.. మా ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Andhra Pradesh CM Jagan), తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR), బీజేపీ (BJP)లను ఎందుకు లాగుతున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

  వైఎస్ జగన్ మీ బంధువైతే “మా” ఎన్నికలకు వస్తారా? ఓటేయిస్తారా? లేకా ఓటేస్తారా..? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా? అని నిలదీశారు. ఎన్నికలు అన్న తారువాత గెలుపు ఓటములు సహజమని. అయితే మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదన్నారు ప్రకాష్ రాజ్. నరేష్ అహంకారి అని.. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలన్నారు ప్రకాష్ రాజ్.

  ఇదీ చదవండి: వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోతోందా..? నివారణ కోసం ఏం చేయాలి?

  మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారని, శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నానంటోన్న నరేష్ చక్రం దొబ్బేశామని ప్రకాష్ రాజ్ సెటైర్ వేశారు. చాలా బాధతో, ఆక్రోశంతో మాత్రమే సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నామని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామిలో మంచు విష్ణు కొట్టుకుపోవాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు.

  ఇదీ చదవండి: కోడిగుడ్ల రోల్.. 20 నిమిషాల్లో తింటే 20 వేల బహుమతి.. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి

  మా ఎలక్షన్స్ అక్టోబర్ 10 న జరగబోతున్నాయి. దీనికి సంబదించిన నోటిఫికేషన్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యనే పోటీ ఉండనుంది.

  ఇదీ చదవండి: వంట నూనె రెండోసారి వాడుతున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

  అక్టోబర్ రెండు నామినేషన్‌ ఉపసంహరణకు చివరి తేది కావడంతో ప్రెసిడెంట్ కోసం నామినేషన్ వేసిన సివిఎల్ నరసింహారావు తాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక జనరల్ సెక్రటరీ కోసం నామినేషన్ వేసిన బండ్ల గణేష్ కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో తాజాగా మా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Actor prakash raj, Andhra Pradesh, Ap cm jagan, AP News, CM KCR, MAA Elections, Manchu Vishnu

  తదుపరి వార్తలు