ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ పై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు (Supreme Court) ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు (High Court) అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి. దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు (MLC Ananthababu) నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.
తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు (MLC Ananthababu) నిందితునిగా ఉన్నారు. ఈ కేసులో అనంతబాబు (MLC Ananthababu) మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటున్నారు. బెయిల్ కోసం అనంతబాబు (MLC Ananthababu) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు (Andhra Pradesh High court) లో రెగ్యులర్ బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై సెప్టెంబర్ 26న ఏపీ హైకోర్టు (Andhra Pradesh High court) లో జరిగిన విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) కు చుక్కెదురైంది. బెయిల్ పిటీషన్ ను కోర్టు (Andhra Pradesh High court) కొట్టి వేసింది.
ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu) జైలులో ఉండగానే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. అనంతబాబు (MLC Ananthababu) తల్లి మంగరత్నం ఆగష్టు నెలలో మృతి చెందారు. దీనితో అతనికి రాజమండ్రి ఎస్సి, ఎస్టీ కోర్టు ప్రత్యేక అవకాశం కల్పించింది. తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి 3 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మూడు రోజులు స్వగ్రామం ఎల్లవరం ధాటి బయటకు పోవద్దని అనంతబాబుకు (MLC Ananthababu) కోర్టు తెలిపింది. అలాగే రూ.25 వేలు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
ఇక తాజాగా బెయిల్ పై అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు పంపిస్తూ విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Supreme Court