Nannapaneni Rajakumari: ఏపీ టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి తలకు గాయం

Nannapaneni Rajakumari: ఇంట్లో కాలు జారి పడిపోవడంతో నన్నపనేని రాజకుమారి తలకు గాయమైంది.

news18-telugu
Updated: September 26, 2020, 6:03 PM IST
Nannapaneni Rajakumari: ఏపీ టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి తలకు గాయం
నన్నపనేని రాజకుమారి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ టీడీపీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారికి గాయమైంది. తెనాలిలోని తన నివాసంలో ఆమె కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆమె తలకు గాయమైంది. అయితే కుటుంబసభ్యులు వెంటనే స్పందించి హుటాహుటిన నన్నపనేని రాజకుమారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చెకప్ అనంతరం ఆమె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తన ఇంట్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స పొందుతున్నారు. మరోవైపు నన్నపనేని రాజకుమారికి గాయమైందనే విషయం తెలియగానే... అనేకమంది టీడీపీ నేతలు ఆమె ఆరోగ్యంపై కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజుల నుంచి రాజకుమారి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న నన్నపనేని రాజకుమారి.. టీడీపీలోని కీలక మహిళా నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నన్నపనేని రాజకుమారిని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించింది.
Published by: Kishore Akkaladevi
First published: September 26, 2020, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading