HE FIRST CORONAVIRUS POSITIVE CASE HIT THE VIJAYANAGARAM DISTRICT BN
ఏపీలో కరోనా కలకలం.. అన్ని జిల్లాలను తాకిన వైరస్.. తాజాగా విజయనగరంలోనూ..
టాప్ 12 : విజయనగరం జిల్లా (137 కేసులు)
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె విశాఖపట్నానికి వెళ్లింది. అక్కడ ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. సదరు మహిళకు కొడుకుల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అనుమానిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని విజయనగరం జిల్లాలోనూ తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టయ్యింది. విజయనగరం జిల్లాలోని బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె విశాఖపట్నానికి వెళ్లింది. అక్కడ ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. సదరు మహిళకు కొడుకుల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అనుమానిస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సభ్యులందరినీ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్వీ రమణకుమారి చెప్పారు. అయితే ఆ మహిళ కుటుంబ సభ్యులు దాదాపుగా విజయనగరం జిల్లా అంతటా తిరిగినట్టు సమాచారం. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.