HBD NTR Jr - Nara Lokesh: ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెష్ తెలిపిన టీడీపీ నేత నారా లోకేష్..

ఎన్టీఆర్, లోకేష్ (Twitter/Photo)

ఈ రోజు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ రోజు ఎన్టీఆర్ 37 ఏళ్లు కంప్లీట్ చేసుకొని 38వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ జూనియర్ ఎన్టీఆర్‌‌కు సినీ రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందజేసారు.

  • Share this:
    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ సెలెబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు ట్విట్టర్‌లోె ట్రెండింగ్ అవుతోంది. ఇక మరోవైపు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన విడుదల చేసారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకటేష్ సహా పలువురు హీరోలు బర్త్ డే విషెస్ తెలియజేసారు. మరోవైపు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా తారక్‌కు స్పెషల్‌గా బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేసారు.






    మరోవైపు ఏపీ టీడీపీ నేత నారా లోకేష్.. తారక్‌కు హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అంతేకాదు నువ్వు ఇలంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాను అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

    ప్రస్తుతం ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ సినిమా చేయనున్నారు. . ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలో ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ త్వరలో జెమిని టీవీలో ప్రసారం కానుంది. బిగ్‌బాస్ షో తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ప్రోగ్రామ్ ఇదే. మరోవైపు ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు పిలుపునిస్తున్నారు. అంతేకాదు టీడీపీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో సినిమా వాళ్లు అంతగా రాణించిన సందర్భాలు లేవు. తాజాగా జరిగిన తమిలనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ ఓడిపోవడాన్ని ఓ సాకుగా చూపిస్తున్నారు. కానీ ఎంతో మంది కార్యకర్తల బలం ఉన్న టీడీపికి ఎన్టీఆర్ జత కూడితే ఆ బలం వేరు అంటున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పార్టీ కాబట్టి.. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడితే.. కొంతలో కొంత ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశాలున్నాయనే వారు లేకపోలేదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: