తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు మనవడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును కుటుంబం ఘనంగా జరుపుకొంటున్నది. దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా సోమవారం తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం జరగనుంది. టీటీడీ అన్నదానం పథకానికి ఒక్క రోజు అయ్యే మొత్తం ఖర్చును విరాళంగా ఇచ్చారు నారా భువనేశ్వరి.
ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే వ్యయం రూ. 30లక్షలను విరాళంగా ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీకి చంద్రబాబు కుటుంబం కోరింది. దీంతో సోమవారం తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు తనయుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిలకు 2007లో వివాహం జరగ్గా, ఈ జంటకు 2015లో తొలి సంతానంగా దేవాన్ష్ పుట్టాడు. ఇవాళ్టితో దేవాన్ష్ ఎనిమిదో ఏట అడుగుపెడతాడు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, నారా అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.