Home /News /andhra-pradesh /

HARASSMENT ON A WOMAN AT WORKPLACE IN ANDHRA PRADESH CHITOOR DISTRICT AFTER SHE PREGNANT HE ESCAPED NGS TPT

Crime News: అతడికి 50.. ఆమెకు 19.. ఉద్యోగం ఆశచూపించాడు.. విషయం బయపడ్డాక ఏం చేశాడంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Harassment on Women: ఉద్యోగం కావాలి అంటూ వచ్చిన యువతికి మాయ మాటలు చెప్పాడు.. మించి జీవితం చూపిస్తానని ఆశ చూపి.. ప్రేమ వల విసిరాడు... చివరికి ఆ మహిళ గర్భవతి అని తెలిసిన తరువాత ఏం చేశాడంటే..?

  GT Hemanth Kumar, Tirupathi, News18  

  Harassment on women at Work Place:  సమాజం చాలా ముందుకు వెళ్తోంది.. పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతల్లో ఇటీవల మహిళలు అద్భుతాలు చేస్తున్నారు. అయినా చాలా చోట్ల వారికి వేధింపులు (Harassment) తప్పడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోటు తరచూ ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం..  ఆశ్రయం పొందిన మహిళలను, సహాయం ఆర్జించి వచ్చిన యువతులను తమ లైంగిక అవసరాలకోసం వాడుకుంటున్నారు.  వినకపోతే పశువుల్లా పైశాచికత్వానికి పాల్పడుతున్నారు (Sexual Harassment).  తాజాగా ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించింది యువతీ.  తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి యువతిని వెంట తిప్పుకున్నాడు. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్నాడు. మాయమాటలు చెప్పి మెల్లగాముగ్గులోకి దింపాడు. నేనుంటే నీకు ఎలాంటి కష్టం రాదని లోబరుచుకున్న సంఘటన నెల్లూరు జిల్లా (Nellore District)లో చోటు చేసుకుంది.

  పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం. నెల్లూరు జిల్లా సూళూరు పేటలో నివాసం ఉంటున్నాడు 50 ఏళ్ల  గోపాల్ (Gopal) అతనికి  శ్రీహరికోట శబరి కాలనీకి చెందిన 19 ఏళ్ల యువతీ పరిచయం అయ్యింది. ఇంట్లో ఆర్థిక  ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది.  తెలిసిన చోట ఏదైనా స్వీపర్ పని ఇప్పించాలని ప్రాధేయ పడింది. దింతో నేనుండగా నీకేం భయం శ్రీహరి కోటలో స్వీపర్ ఉద్యోగం అంటూ హామీ ఇచ్చాడు గోపాల్.

  ఇదీ చదవండి : ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్.. పన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త..

  యువతి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న.... గోపాల్ యువతిని ఎలగైన ముగ్గులోకి దింపాలని చూసాడు.  ఒకరోజు యువతిని ఉద్యోగం గురించి మాట్లాడాలని రమ్మని పిలిపించాడు. నీకు ఉద్యోగం రావడం ఖాయమని.... తాను చెప్పిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పడు. అయితే చెప్పినట్లు చేస్తేనే  ఉద్యోగం వస్తుందని పేద యువతిని వంచనకు గురి చేసాడు. స్వీపర్ ఉద్యోగం కోసం నా కోరిక తీర్చాలని చెప్పాడు.

  ఇదీ చదవండి : ఏపీలో మళ్లీ ఆంక్షలు..! భారీగా పెరుగుతున్న కేసులు.. ఆ జిల్లాల్లో భయం భయం

  అతడి కోరిక తీర్చడానికి ఆమె సారేమిరా అంది..  ఇంటి అవసరాలకు... డబ్బులు... డబ్బులు రావాలంటే ఉద్యోగం కావాలి అనే భావనలో గోపాల్ మాయమాటలకు లొంగి పోయింది. దింతో ఆ యువతికి స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. అక్కడితో ఆగక అవసరమైన సందర్భాల్లో తన కోరిక తీర్చాలని హుకుం జారీ చేసారు.  తనకు కోరికలు పుట్టిన ప్రతిసారి  యువతీ పై లైంగిక దాడి చేసే రాక్షర ఆనందం పొందే వాడు.

  ఇదీ చదవండి : కొడుకు కళ్ల ముందే ఇష్టం లేని వ్యవహారం.. చివరికి ఏం జరిగిదంటే..?

  త్యం ఆమెపై లైంగిక డాదికి పాల్పడటంతో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న గోపాల్ యువతిని తన బంధువుల ఇంటికి తీసుకువెళ్లి అబార్షన్‌ చేయించాడు. ఈ విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో, బుధవారం వారు ఆమెను  పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి ఫిర్యాదు చేయించారు. నిందితుడిపై పోలీసులు రేప్‌ కేసు నమోదు చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chitoor, Crime news, Female harassment

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు