Happy Sankranti 2020 : సంక్రాంతికి సెలబ్రిటీల స్పెషల్ విషెస్...

Happy Sankranti 2020 : సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ... సినీ, రాజకీయ ప్రముఖులు... తమ శుభాకాంక్షలు చెబుతున్నారు.

news18-telugu
Updated: January 15, 2020, 6:03 AM IST
Happy Sankranti 2020 : సంక్రాంతికి సెలబ్రిటీల స్పెషల్ విషెస్...
Happy Sankranti 2020 : సంక్రాంతికి సెలబ్రిటీల స్పెషల్ విషెస్...
  • Share this:
Happy Sankranti 2020 : న్యూఇయర్‌కి గ్రాండ్ వెల్‌కం చెప్పిన సెలబ్రిటీలు... తెలుగు వారి పండుగ సంక్రాంతిని కూడా ఘనంగా ఆహ్వానించారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఇంటిలిపాదీ ఉత్సాహంగా జరుపుకోవాలంటూ... సినీ, పొలిటికల్ సెలబ్రిటీస్... తమదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా సైట్లలో తమ ఫ్యాన్స్, ఫాలోయర్లకు ఫొటోలు, వీడియోలతో విషెస్ చెబుతుంటే... ఫ్యాన్స్... వాటిని లైక్, షేర్, కామెంట్స్ చేస్తూ... సంక్రాంతికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లు చెప్పే శుభాకాంక్షల ట్వీట్లు, పోస్టులను రీ షేర్ చేసుకుంటూ... తమ తమ ఫ్రెండ్స్, కొలీగ్స్‌కి విషెస్ చెప్పుకుంటున్నారు.







ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో, ఎంత మంచివాడవురా(నేడే రిలీజ్), దర్బార్ సినిమాలు రిలీజ్ కావడంతో తెలుగు ప్రజలు పండుగ రోజుల్లో రోజుకో సినిమా చొప్పున బంధువులతో కలిసి చూస్తున్నారు. దానికి తోడు ఈసారి రిలీజైన అన్ని సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అది టాలీవుడ్‌ పరిశ్రమకు కలిసొచ్చే అంశం. తద్వారా టాలీవుడ్‌కి కూడా ఈసారి నిజమైన సంక్రాంతి వచ్చినట్లైంది.


దేశవ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. కాకపోతే... ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుగుతున్నాయి. పంజాబ్‌లో లోహ్రీ పేరుతో, తమిళనాడులో పొంగల్... ఇలా పేరు ఏదైనా అన్ని చోట్లా అందరూ పండగ చేసుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా్రు.





Published by: Krishna Kumar N
First published: January 15, 2020, 6:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading