అమరావతి హ్యాపినెస్ట్ ఫ్లాట్స్...కొనుగోలుదారులకు జగన్ షాక్...

సీఆర్డీఏ పరిధిలో తొలిసారి జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్ వెళ్లిన ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. కాగా ఇప్పటికే ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అయోమయంలో పడేసిందనే చెప్పవచ్చు.

news18-telugu
Updated: November 25, 2019, 4:37 PM IST
అమరావతి హ్యాపినెస్ట్ ఫ్లాట్స్...కొనుగోలుదారులకు జగన్ షాక్...
సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలబెట్టిన హ్యపీనెస్ట్ ఇళ్ల నిర్మాణంపై రివర్స్ టెండర్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. హ్యాపీ నెస్ట్ ద్వారా ఫ్లాట్లను నిర్మించి విక్రయించాలని తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తలపెట్టింది. అమరావతి సమీపంలోని నేలపాడులో మొత్తం 1200 ఫ్లాట్స్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్మాణానికి ముందు ఫ్లాట్ల విక్రయాలు సైతం జరిగాయి. ఈ ప్రాజెక్టు సీఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తుంది.

ఇదిలా ఉంటే, తాజాగా జగన్ ప్రభుత్వం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును కొనసాగిస్తామని పేర్కొంది. అయితే తిరిగి దీని నిర్మాణంపై మాత్రం కొత్త టెండర్లు పిలవాలని జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలో తొలిసారి జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్ వెళ్లిన ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. కాగా ఇప్పటికే ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అయోమయంలో పడేసిందనే చెప్పవచ్చు. బుకింగ్స్ చేసుకున్న వారికి 24 నెలల్లోగా కట్టి ఇస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. అంతేకాదు మొత్తం 300 ఫ్లాట్స్ ప్రారంభమైన రోజే బుకింగ్స్ పూర్తి కాగా, మరో 900 ఫ్లాట్లు సైతం దాదాపు అమ్ముడుపోయాయి.

కాగా ప్రస్తుతం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ చేస్తే ఫ్లాట్స్ నిర్మాణం జాప్యం జరుగుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రియల్ ఎస్టేట్ రూల్స్ 2016 ప్రకారం ప్రాజెక్టు కోసం డబ్బులు వసూలు చేసి ఏళ్ల తరబడి ఫ్లాట్లను అందించడంలో జాప్యం చేస్తే కస్టమర్లకు అసలుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు బిల్డర్‌ చెప్పిన సమయానికి ఇళ్లు పూర్తిచేసి అప్పగించలేక పోతే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వసూలుచేసే గరిష్ఠ వడ్డీరేటును, అదనంగా మరో రెండు శాతాన్ని కస్టమర్లకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో హ్యాపినెస్ట్ లాంటి ప్రాజెక్టు ఇంకా మొగ్గ దశలోనే ఉన్న కారణంగా కస్టమర్లలో ఆందోళన నెలకొంది.
Published by: Krishna Adithya
First published: November 25, 2019, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading