మెగాస్టార్‌ చిరంజీవిపై నారా లోకేష్ ప్రశంసలు

విభిన్నపాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. ఎంతో మందికి మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని ట్వీట్ చేశారు లోకేష్.

news18-telugu
Updated: August 22, 2019, 6:02 PM IST
మెగాస్టార్‌ చిరంజీవిపై నారా లోకేష్ ప్రశంసలు
చిరంజీవి, లోకేష్
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి నేడు 64వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని చిరంజీవి నిరూపించారని లోకేష్ ప్రశంసలు కురిపించారు. విభిన్నపాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. ఎంతో మందికి మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని ట్వీట్ చేశారు లోకేష్.

ఇంటిల్లి పాదికీ వినోదాన్ని అందించే విభిన్నపాత్రలలో నటించి ప్రేక్షక హృదయాల్లో చిరంజీవి చెరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పట్టుదల, కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవిగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
నారా లోకేష్
కాగా, చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న విడుదల కానుంది. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, నిహారిక నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ మూవీలో స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు.
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు