Home /News /andhra-pradesh /

HAPPY BIRTHDAY CBN CHANDRABABU NAIDU TURNS 73 TDP CHIEF GEAR UP FIGHT ON AP CM JAGAN ON BIRTHDAY MKS

HBD CBN: గొంతులో విషం దాచుకున్న శివుడు! -పుట్టినరోజు కూడా టీడీపీ చంద్రబాబు బాదుడే బాదుడు..

చంద్రన్న కథా గానం వీడియో ప్రోమోలోని దృశ్యం

చంద్రన్న కథా గానం వీడియో ప్రోమోలోని దృశ్యం

దేశంలో ప్రస్తుతం ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న సీనియర్మోస్ట్ పొలిటిషన్ ఆయనే కావొచ్చు. ఇవాళ (ఏప్రిల్ 20) చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏం చేయబోతున్నారంటే..

అందరు వేరు.. ఆయన వేరు.. అని అందరూ అనుకునేలా.. రాజకీయాల్లో తనదైన శైలిని ఫాలో అవుతారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. దేశంలో ప్రస్తుతం ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న సీనియర్మోస్ట్ పొలిటిషన్ ఆయనే కావొచ్చు. ఇవాళ (ఏప్రిల్ 20) చంద్రబాబు పుట్టినరోజు. నేటితో ఆయన 73వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ వయసులోనూ యువ ప్రత్యర్థి, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తో పోరాటానికి ఢీఅంటే ఢీ అంటున్నారు చంద్రబాబు. తన పుట్టినరోజైన బుధవారం కూడా బాబు టీడీపీ కొనసాగిస్తోన్న ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. త్వరలోనే జిల్లాల పర్యటన కూడా చేపట్టనున్నారు.

పుట్టినరోజు సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ విదేశాల్లోని టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు బుధవారం భారీ కార్యక్రమాలు తలపెట్టారు. అధినేత పుట్టినరోజుకు సర్ ప్రైజ్ గిఫ్ట్ లాగా టీడీపీ ‘చంద్రన్న కథాగానం’ పేరుతో రూపొందించిన పాట ప్రస్తుతం నెట్టంట హల్ చల్ చేస్తోంది. చంద్రబాబును శివుడితో, మునితో పోల్చుతూ ఆ పాట సాగుతుంది. (వీడియో కింద ఉంది)

చంద్రబాబు ఉత్సాహం(పాత ఫొటో)

శిష్యుడు KCRకు స్పాట్ పెడుతోన్న Chandrababu -రూ.2లక్షల అస్త్రం.. టీటీడీపీనే ప్రత్యామ్నాయం!


‘సల్లనితల్లి అమ్మణ్నమ్మ తొలిసూరు కొడుకు.. సమరంలో వెనుకడుగే వేయడు గెలుపొందే వరకు.. నిందలు ఎన్నో మోశాడమ్మా నింగిని కాచుటకు.. కంఠాన గరళాన్ని దాచుకున్న శివుడా నువ్వు.. ఎవరెన్ని మాటలు అన్నా మునిలా మౌనంగుంటావు..’ అంటూ చరణ్ అర్జున్ స్వరపర్చి, ఆలపించిన ఈ పాటలో చంద్రబాబుకు భారీ ఎలివేషన్లు కల్పించారు. చంద్రబాబు ఈ పుట్టినరోజును ప్రజలమధ్యే జరుపుకోనున్నారు.

KCR కటీఫ్ చెబితేనే? -ప్రశాంత్ కిషోర్‌కు కాంగ్రెస్ కండిషన్? -మరోసారి సోనియాతో పీకే భేటీ
పుట్టినరోజు నాడు చంద్రబాబు భారీ ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు.. ఆ తర్వాత మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నాయకులు, కార్యకర్తల్ని కలవనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలగొల్లగూడెం గ్రామంలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం నెక్కలంగొల్లగూడెం గ్రామానికి చేరుకుంటారు. కొందరి ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. స్థానికులతో సహపంక్తి భోజనం చేస్తారు.

CM KCR : కేసీఆర్‌కు భారీ షాక్.. గులాబీ బాస్ బీజేపీ వ్యతిరేకి కాదా! -ఫెడరల్ ఫ్రంట్ ఫసక్?


రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు మరో ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మే మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో పర్యటనలు మొదలుకానున్నాయి. మహానాడు తర్వాత ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున... ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రోడ్డు షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలా, గ్రామ సభలు నిర్వహించాలా అనే అంశంపై పార్టీ నాయకులతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ వైసీపీ ధరల శరాఘాతాలపై ‘బాదుడే బాదుడు’ పేరుతో భారీ నిరసనలు కొనసాగిస్తున్నది.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP, Ys jagan, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు