Home /News /andhra-pradesh /

HANDOVER ALL RECORDS TO CBI REGARDING YS VIVEKA MURDER CASE AP HIGH COURT ORDERS PULIVENDULA MAGISTRATE AK

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐకు అందజేసే విషయంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చేపట్టిన సీబీఐకు అన్ని రికార్డులను అందజేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐకు వెంటనే వాటిని అప్పగించాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. అంతకుముందు సీబీఐకు వివేకా హత్య కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని తమకు ఆదేశాలు లేవని పులివెందుల మేజిస్ట్రేట్ అన్నారు. సీబీఐకు రికార్డులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రికార్డులు తమకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. హైకోర్టు ఆదేశాలతో వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ చేస్తోంది.

    ఈ కేసును మరింతలోతుగా విచారిస్తున్న సీబీఐ.. అంతకుముందు ఎవరూ విచారించని నిందితులను విచారించింది. అంతకుముందు సిట్ విచారించిన నిందితులతో పాటు కొత్త కోణంలోనూ ఈ కేసు విచారణను ముందుకు తీసుకెళ్లింది సీబీఐ. సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు.. విచారణలో భాగంగా పులివెందుల, కాణిపాకం, తిరుమల, కదిరి ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆ బృందంలోని ఏడుగురికి కరోనా సోకింది. దీంతో ఈ కేసు విచారణకు బ్రేక్ పడింది. నెల పాటు ఈ కేసు విచారణకు బ్రేక్ ఇచ్చింది సీబీఐ. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన అధికారుల్లో చాలామంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. సీబీఐ ఈ కేసుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకు ఇవ్వాలని ఏపీ హైకోర్టు పులివెందుల మేజిస్ట్రేట్‌ను ఆదేశించడంతో.. మరోసారి ఈ కేసు విచారణ వేగం పుంజుకునే అవకాశం ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, CBI, Ys viveka murder case, YS Vivekananda reddy

    తదుపరి వార్తలు