తిరుమలలో హజ్, జెరూసలేం యాత్రలపై ప్రచారం..భక్తుల ఆగ్రహం

తిరుమలలో హజ్, జెరూసలేం యాత్రా ప్రకటనలు దర్శనమివ్వడంతో బీజేపీ, హిందూ సంఘాలు మరోసారి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

news18-telugu
Updated: August 22, 2019, 6:59 PM IST
తిరుమలలో హజ్, జెరూసలేం యాత్రలపై ప్రచారం..భక్తుల ఆగ్రహం
తిరుమల శ్రీవారి ఆలయం
news18-telugu
Updated: August 22, 2019, 6:59 PM IST
తిరుమలలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఈ ప్రకటనలపై శ్రీవారి భక్తులు భగ్గుమన్నారు. తిరుమల క్షేత్రంలో అన్యమతాల ప్రచారంపై నిషేధం ఉన్నా...హజ్, జరూసలేం యాత్రలపై ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

బస్ టికెట్‌పై హజ్, జెరూసలేం యాత్ర యాడ్స్


కాగా, ఇటివల శ్రీశైలంలో షాపుల వేలం వ్యవహారంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయ ప్రాంగనంలో ఉన్న దుకాణాలను ముస్లింలకు కేటాయించారని హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఛలో శ్రీశైలం ఆందోళనకు పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం స్పందించి..ఆలయ ఈవోపై బదిలీ వేటువేసింది. అంతేకాదు షాపుల వేలాన్ని కూడా రద్దు చేసింది. తాజాగా తిరుమలలో హజ్, జెరూసలేం యాత్రా ప్రకటనలు దర్శనమివ్వడంతో బీజేపీ, హిందూ సంఘాలు మరోసారి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...