Love Marriage: పెద్దలను ఎదురించారు.. ప్రేమ వివాహం చేసుకున్నారు.. కాసేపటికే వధువు మిస్సింగ్

పెళ్లైన కాసేపటికే యువి మిస్సింగ్

ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం కలిసి తోడు నీడగా బతకాలి అనుకున్నారు. అయినా పెళ్లి కూతురు బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో.. ఆ జంట పోలీసులను ఆశ్రయించింది.. కానీ కాసేపటికే యువతి మిస్సైంది.. ఏం జరిగిదంటే..

  • Share this:
    యువత ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తామంటోంది.. పెద్దలు పరువు అంటూ వెళ్లాడుతున్నారు. పరువు పోతోందనే అవమానంతో కొందరు రాక్షసంగా మారిపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంటను బలవంతంగా విడదీసి యువతిని కిడ్నప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ కులాల వేరని పెద్దలు విడదీయాలి అని చూశారు. అయినా అన్నింటినీ ఎదుర్కొన్నారు. ధైర్యంగా ముందడుగు వేశారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జీవితాంతం తోడు నీడగా ఉండాలి అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు పెరగడంతో.. పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా పోలీసు అధికారులను ఆ జంట ఆశ్రయించింది. మీకేం కాదని పోలీసులు భరోసా కూడా ఇచ్చారు. కానీ కాసేపటికే.. నవ వధువు మిస్ అవ్వడం తీవ్ర కలకలం రేపింది.

    గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని బేతపూడిలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన చందు, కౌసర్ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే పెద్దలు పెళ్లికి నో చెప్పారు. దీంతో గుంటూరు నగరంలోని నెహ్రు నగర్ లో ఉన్న శేషాచల ఆశ్రమంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తరువాత.. నూతన దంపతులు జిల్లా ఎస్పీని కలిసి స్పందనలో.. తమకు రక్షణ కావాలని కోరారు.

    ఇద్దరివైపు పెద్దలను పిలిపించిన పోలీసులు.. వాళ్లిద్దరూ మేజర్లని, ఎలాంటి ఇబ్బందీ కల్పించకూడదని నచ్చజెప్పి పంపారు. పోలీసుల భరోసాతో నూతన దంపతులు పోలీసు స్టేషన్ నుంచి ఆటోలో ఇంటికి వెళుతుండగా యువతి తరపు బంధువులు కొందరు వచ్చి దాడి చేసి నవ వధువును అపహరించు పోయారు. తన భార్యను అప్పగించాలని వేడుకున్నా.. వినకుండా అతన్ని చితకబాది వధువును తీసుకెళ్లారు. ఆ విజువల్స్ అక్కడున్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ఘటన జరిగిన రెండు రోజులు గడిచినా తన భార్య ఆచూకి తెలియడం లేదని వరుడు ఆవేదన చెందుతున్నాడు. తన భార్యను తనకు అప్పగించకపోతే.. స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు వరుడు చందు..
    Published by:Nagesh Paina
    First published: