ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఓ మహిళా ఎమ్మెల్యే కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమవతున్నాయి. గుంటూరు జిల్లా (Guntur District) తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (MLA Undavalli Sridevi) మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా ఆమె మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
రాజకీయ నాయకులు తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. వివిధ కార్యక్రమాల్లో ప్రసంగాలు చేసే సమయంలో మాట దొర్లడం, ఒక్కోసారి పొరబాటుగా మాట్లాడటంతో తీవ్ర విమర్శలెదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ మహిళా ఎమ్మెల్యే కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమవతున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా ఆమె మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో జరిగిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవంలో పాల్గొన్న ఆమె.. తన ప్రసంగంలో భాగంగా అంబేద్కర్ తమకు హక్కులు కల్పించలేదని.. బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు హక్కులు అధికారాలు వచ్చాయని ఆమె అన్నారు.
జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూనే రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేసి సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేశారని ఆమె అన్నారు. ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఎమ్మెల్యే శ్రీదేవి కామెంట్స్ పై అంబేద్కర్ వాదులు మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు ఎస్సీ కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయంటున్నారు.
ఐతే సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీదేవి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే... ఆ రాజ్యాంగాన్ని అమలు చేసింది బాబూ జగ్జీవన్ రామ్ అని ఆమె వివరణ ఇచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూనే ఆయన అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఇక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తాను అంబేద్కర్ ను కించపరచలేదని ఆమె స్పష్టం చేశారు. తనపై ఎవరో కుట్ర చేసి కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తనకు బీఆర్అంబేద్కర్ అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. ఆ సభలో తాను బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికే పూలమాల వేశానని.. తాను చుదువుకున్నది కూడా బీఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలోనే అని గుర్తు చేశారు.
గతంలోనూ ఉండవల్లి శ్రీదేవి వివాదాల్లో చిక్కుకున్నారు. పేకాట క్లబ్బులు నడిపించారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె వాటిని ఖండించారు. ఆ తర్వాత ఆమె అనుచరుడితో వివాదం నేపథ్యంలో కాల్ రికార్డ్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక ఏపీ రాజధాని ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి.. మూడు రాజధానుల నిర్ణయం తర్వాత తీవ్ర విమర్శలెదుర్కొన్నారు. రాజధాని తరలింపు సరైందేనని వ్యాఖ్యానించడంపై స్థానికులు ఆమెపై మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.