Ambati Rambabu: ఆడియో టేప్ ఎఫెక్ట్... మినిస్టర్ రేస్ నుంచి అంబటి ఔట్..? ఇది వారి పనేనా..?

అంబటి రాంబాబు (ఫైల్ ఫొటో)

Ambati Rambabu: గుంటూరు జిల్లాలో ఎంతో మంది ఆశావాహులు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. అంబటిపై వచ్చిన ఆరోపణలతో జిల్లా ఆశావాహుల లిస్ట్ నుంచి ఒక వికెట్ డౌన్ అయిందనే చర్చ జరుగుతోంది.

 • Share this:
  అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావడంతో మంత్రివర్గంలో ఎవరికి అవకాశం కల్పించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల భారీగా నామినేషన్ పోస్టులు భర్తీ చేయడం, మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల పదవులు కట్టబెట్టడంతో కొంతమంది ఆశావాహులు మెత్తబడ్డారు. ఐతే ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో మాత్రం ఇంకా మంత్రిపదవులపై ఆశలున్నాయి. దీంతో ఎవరికివారు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే సమయంలో మంత్రి పదవుల రేసులో ఉన్నవారిపై సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. అలాంటి వారిలో ముందున్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. విపక్షాలపై ఎదురుదాడి చేసే ప్రధాన అస్త్రాల్లో ఆయన ఒకరు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి అధికార ప్రతినిధిగా వైఎస్ జగన్ వెన్నంటి నడుస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

  2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీని భావించారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల పదవి వరించలేదు. ఇప్పుడు మరోసారి మంత్రి పదవి రేసులో అంబటి పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ అంబటి రాంబాబు సంజన అనే అమ్మయితో మాట్లాడినట్టు గా వచ్చిన వాయిస్ రికార్డులు మీడియాలో హల్ చల్ చేశాయి. ఐతే సదరు మహిళతో గానీ, వాయిస్ రికార్డుతో గానీ తనకు సంబంధం లేదని వాదించిన ఆయన.. రాజకీయ జీవితానికి మచ్చరాకుండా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.

  ఇది చదవండి: ఏపీ పాలిటిక్స్ పై కమలనాథుల కొత్త వ్యూహం.. ఇక వైసీపీ- బీజేపీ సమరమేనా...?


   ఇప్పుడు వచ్చిన సుకన్య అనే మహిళతో మాట్లాడుతున్నట్లు వచ్చిన ఆడియో లీకులతో తనకేమీ సంబంధం లేదని వాదిస్తున్నారు అంబటి. సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసి మరీ అంబటే మాట్లాడాడు అని నిరూపించటానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయా ప్రచారాలను నమ్మవద్దంటూ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఐతే ఈ ఆడియో లీకుల వెనుక ప్రతిపక్షాలే ఉన్నాయా...? లేక ఆయనకు మంత్రి పదవి రాకుండా ఇంకా ఎవరైనా గోతులు తవ్వుతున్నారా..? అనేది ప్రస్తుతానికి ఆన్సర్ లేని ప్రశ్న.  గతంలో కూడా వైసీపీ నేత, నటుడు పృథ్వీ కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కొని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కోల్పోయారు. తాజాగా ఆడియో లీక్ తో అంబంటి కూడా మంత్రి పదవుల రేస్ నుంచి ఔట్ అయ్యారన్నా టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తుండగా.., ఇప్పుడు అంబటి ఎపిసోడ్ పై వారికి మరో అస్త్రమైంది. దీంతో దీనిపై ఇంకెంత రాద్దాంతమవుతుందోనని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అంబటి రాంబాబుపై వచ్చిన ఆరోపణలను సీఎం జగన్ లైట్ గా తీసుకునే అవకాశాలు లేకపోవచ్చని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

  ఇది చదవండి: ఆషాఢమని పుట్టింటికి వచ్చిన నవ వధువు.. ఇంతలో మాజీ ప్రియుడు కలిశాడు.. ఆ తర్వాత...


  గుంటూరు జిల్లాలో ఎంతో మంది ఆశావాహులు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. అంబటిపై వచ్చిన ఆరోపణలతో జిల్లా ఆశావాహుల లిస్ట్ నుంచి ఒక వికెట్ డౌన్ అయిందని కొందరు సంబరపడుతున్నట్లు సమాచారం. మరి రెండోసారి చుట్టుముట్టిన లీకుల వివాదం నుంచి అంబటి ఏ విధంగా బయటపడతారో వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published: