K. Gangadhar, News18, Guntur
బాపట్లలో వైసీపీ నాయకుల పీసీలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ చంద్రబాబు వారి తనయుడు లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. రాజధాని అడ్డం పెట్టుకొని స్కాములు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
1200 కోట్లతో తాత్కాలిక సచివాలయం చంద్రబాబు నిర్మిస్తే , కేవలం 750 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాశ్వత పార్లమెంట్ భవనాన్ని సంవత్సరకాలంలో నిర్మిస్తుందన్నారు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.శాసనమండలి ఎన్నికలలో వక్రమార్గం ద్వారా విజయం సాధించిన చంద్రబాబు గెలుపు కాదు వాపు మాత్రమేనని విమర్శించారు
వక్రమార్గంలో రావడం లక్ష్యం సాధించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదవాడికి భద్రత భరోసా లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...శాసనమండలి ఎన్నికలలో ప్రలోభ పెట్టిన వారిని ప్రలోభ పడిన వారిని గుర్తించి శిక్షించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News, Ysrcp