Home /News /andhra-pradesh /

GUNTUR YSRCP CHILAKALURIPET MLA VIDADALA RAJANI SELF PUBLICITY IS TALK OF THE TOWN IN YS JAGANMONAH REDDY GOVERNMENT FULL DETAILS HERE PRN BK

Vidadala Rajini Publicity: హాట్ టాపిక్ గా మారిన ఆ ఎమ్మెల్యే వ్యవహారం.. సీఎంకే షాకిచ్చేలా పబ్లిసిటీ..!

సీఎం జగన్ తో విడదల రజిని(ఫైల్)

సీఎం జగన్ తో విడదల రజిని(ఫైల్)

కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌నే వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఈ ఎమ్మెల్యే త‌న సోష‌ల్ మీడియా (Social Media) టీమ్స్ కి ప్ర‌త్యేక‌మైక టార్గెట్స్ ఇచ్చి మ‌రి త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నార‌ని స‌మ‌చారం.

  M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

  పబ్లిసిటీకి.. పొలిటికల్ లీడర్స్ కు ఎంత అభినాభావ సంబంధముందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ గురించి తాము ఎంత ప్రచారం చేసుకుంటే అంత ప్రజలకు చేరువ అవడంతో పాటు పార్టీ అధినేత మ‌న‌సుకు కూడా ద‌గ్గ‌ర‌వుతామ‌నే న‌మ్మ‌కం రాజ‌కీయ నేత‌ల్లో ఉంటుంది. అందుకే త‌మ‌ని తాము ఎలివేట్ చేసుకోవ‌డానికి అందివచ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు పోలిటిషియ‌న్స్. ఇప్పుడు ఇదే కోవలోకి వ‌స్తారు గుంటూరు జిల్లా, చిల‌క‌రూరు పేట ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ విడ‌ద‌ల ర‌జ‌నీ. గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు మ‌హానాడు స‌భ‌లో బాబును విపరీతంగా పోడ‌గ‌త్త‌ల‌తో ముంచెత్తి అప్ప‌ట్లో హైలెట్ అయిన ఈ ఎమ్యెల్యే ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. వైసీపీకి రావ‌డంతోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లెక్కారు ర‌జిని. ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి ఆమె సోష‌ల్ మీడియాలో చేసుకునే ప్ర‌మోష‌న్లు చాలా సార్లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి కూడా. ఒక‌నొక ద‌శ‌లో ఈ ఎమ్మెల్యే కేవలం సోష‌ల్ మీడియాలో త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నారనే వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొట్టాయి.

  ఆమె చేసే ప్ర‌చారం కూడా ఆ వార్త‌ల‌కు బ‌ల‌ప‌రిచే విధంగానే ఉన్నాయి. పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహాన్ రెడ్డి పాద‌యాత్ర స‌మ‌యంలో ఏ స్థాయిలో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకున్నారో అదే స్థాయిలో రజని తన గురించి పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. తాజాగా కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌నే వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఈ ఎమ్మెల్యే త‌న సోష‌ల్ మీడియా టీమ్స్ కి ప్ర‌త్యేక‌మైక టార్గెట్స్ ఇచ్చి మ‌రి త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నార‌ని స‌మ‌చారం. నియోక‌వ‌ర్గంలో ఏ అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రిగిన క్ష‌ణాల్లో సోష‌ల్ మీడియాలో ఫోటోలు, వీడియోల రూపంలో వైర‌ల్ చేస్తున్నారు. తాను ప్రారంభించిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ప్ర‌చారం చేసుకుంటే ఎవ‌రు అభ్యంత‌రం చెప్ప‌రు కానీ ముఖ్య‌మంత్రి ప్రారంభించిన ఏ అభివృద్ది కార్య‌క్ర‌మం అయిన త‌న పేరుతో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేయడం ఇప్పుడు పార్టీలో కొంత మంది సీనియ‌ర్ నేత‌ల‌కు మింగుడ‌ప‌డ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

  జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో సీఎం జగన్ తో ఎమ్మెల్యే రజిని

  ఇది చదవండి: వందేళ్ల రికార్డులు తిరగరాస్తున్నాం... జాగ్రత్తగా ఉండాలన్న సీఎం జగన్...  ఇదిలా ఉంటే తాజాగా ఈ ఎమ్మెల్యే, ముఖ్య‌మంత్రి పాల్గొన్న ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైయ్యారు. అయితే అక్క‌డ ఆవిడ చేసిన హాడ‌విడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌తిక్ష‌ణం జ‌గ‌న్ దృష్టి లో ప‌డేందుకు ఆమె ప‌డ్డ తాప‌త్ర‌యం చూసి మంత్రులు, అధికారులు కూడ ఆశ్చ‌ర్య‌పోయారు అంట‌. అన్ని సందర్భాల్లోనూ ముందు వ‌ర‌స‌లో ఉండి ముఖ్య‌మంత్రిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారట. అయితే ఈ ఎమ్మెల్యే పాట్లు చూసి కేబినేట్ విస్త‌ర‌ణ ఉంది క‌దా అందుకే ఈవిడ ఇలా ముఖ్య‌మంత్రి దృష్టిలో ప‌డేందుకు త‌హాత‌హాలాడిపోతున్నారు అని స‌రిపెట్టుకున్నార‌ట స‌హ‌చ‌ర‌నేత‌లు. మొత్తాని ఈ ఎమ్మెల్యే ప‌బ్లిసిటీ పిచ్చి ఇప్పుడు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  మీ నగరం నుండి (​గుంటూరు)

  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Social Media, Vidadala Rajani, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు